తుపాకులతో బెదిరించి దారి దోపిడీ

Thu,January 17, 2019 01:54 AM

కొడకండ్ల, జనవరి 16 : మండలంలోని మొం డ్రాయి గ్రామంలోని తిరుమల వైన్స్ సిబ్బందిని తుపాకులతో బెదిరించి ఆపై కాల్పులు జరిపి డ బ్బులను దోచుకెళ్లారు. ఈ ఘటనపై బాధితులు ఇ చ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పాలకుర్తి సీఐ రమేశ్ తెలిపారు. ఆయ న తెలిపిన వివరాల ప్రకారం.. తిరుమల వైన్స్ సిబ్బంది రమేశ్, భాస్కర్, శ్రీనులు మంగళవారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో పనులు ముగించుకొని వైన్స్‌లోని డబ్బులను తీసుకుని వా రి సొంత గ్రామమైన పాలకుర్తికి వెళ్తున్నారు. ఈక్రమంలో మండలంలోని రామన్నగూడెం సమీపం లో ఐదుగురు దుండగులు ద్విచక్ర వాహనాన్ని అడ్డగించి తూపాకులతో గాలిలోకి కాల్పులు జరిపి వారిని బెదిరించి వారి దగ్గరున్న రూ. 6,70,000 లను అపహరించుకు పోయారు. ఈమేరకు వైన్ షాప్ సిబ్బంది ఫిర్యాదు చేశారు. దీంతో బుధవారం ఉదయం వరంగల్ సీపీ డాక్టర్ రవీందర్ ఆదేశాల మేరకు వర్ధన్నపేట ఏసీపీ మధుసూదన్ ఆధ్వర్యంలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఎస్సై రాజు, సిబ్బంది పాల్గొన్నారు.

74
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles