కంటి వెలుగు @ 94 రోజులు


Thu,January 17, 2019 01:53 AM

జనగామ, నమస్తే తెలంగాణ, జనవరి 16 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగు పథకానికి జిల్లాలో అనూహ్య స్పందన లభిస్తుంది. బుధవారం 94వ రోజు వరకు జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన శిబిరాల్లో 3,08,558 మందికి నేత్ర పరీక్షలు చేసి, 38,502 మందికి అద్దాల పంపిణీ చేయగా, 9564 మందిని శస్త్ర చికిత్సలకు రెఫర్ చేశారు. వారిలో 359 మందికి శస్త్ర చికిత్సలు నిర్వహించినట్లు వైద్యాధికారులు తెలిపారు.


చౌడారంలో..
జనగామ రూరల్ : మండలంలోని చౌడారం గ్రామంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు వైద్య శిబిరంలో బుధవారం 254 మందికి పరీక్షలు నిర్వహించి 34 మందికి అద్దాలను అందించారు. 19 మందిని కంటి ఆపరేషన్ కోసం రెఫర్ చేశారు. ఈ కార్యక్రమం లో డాక్టర్ కల్పనాదేవి, ఆప్తాల్మజిస్ట్ లిఖిత, వైద్య సి బ్బంది సుధాకర్, శ్యామ్‌సుందర్, ఆంజనేయులు, రజిత, పద్మ, కళ్యాణి, ఉజ్వల, విజయ్‌కుమార్, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, గ్రామస్తులు తదిత రులు పాల్గొన్నారు.

అబ్దుల్‌నాగారంలో..
తరిగొప్పుల : మండలంలోని అబ్దుల్‌నాగారంలో కంటి వెలుగు శిబిరాన్ని సర్పంచ్ అర్జుల రమాదేవి, ఎంపీటీసీ తాళ్లపల్లి అనితలు ప్రారంభించారు. శిబిరంలో 270కి పరీక్షలు నిర్వహించి 45 మంది అద్దాలు పంపిణీ చేశారు. 14 మందిని శస్త్ర చికిత్సల కోసం రెఫర్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సీడ్స్ రాష్ట్ర మాజీ డైరెక్టర్ అర్జుల సంపత్‌రెడ్డి, నాయకులు తాళ్లపల్లి రాజేశ్వర్, వైద్య సిబ్బంది రజినీకాంత్, వేణు, ఉపేందర్, గాలిఫ్, గ్రామస్తులు పాల్గొన్నారు.

86

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles