సీఎం కేసీఆర్‌తోనే పండుగలకు గుర్తింపు

Tue,January 15, 2019 05:10 AM

పాలకుర్తి రూరల్, జనవరి 14: పండుగలు సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతిబింబాలని, ఉత్సవాలతోనే ప్రజల్లో సుఖశాంతులు వెల్లివిరుస్తాయని పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. సంక్రాంతి, భోగి పర్వదినాన్ని పురస్కరించుకుని మండలకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఆవరణలో టీఆర్‌ఎస్ కార్యకర్తలు, నాయకులతో కలిసి సోమవారం పతంగులు ఎగురవేసి సందడి చేశారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ సంక్రాంతి తెలుగు ప్రజల పండుగన్నారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో మకర సంక్రాంతిని జరుపుకోవాలని ఆకాంక్షించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో పంటలు బాగా పండి రైతులు సంతోషంగా ఉండాలన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో పండుగలకు పూర్వవైభవం వచ్చిందన్నారు. రాబోయే రోజుల్లో దేవాదుల, కాళేశ్వరం ప్రాజెక్ట్‌ల నీటితో పాలకుర్తి, చెన్నూరు రిజర్వాయర్లను నింపి, అక్కడి నుంచి నియోజకవర్గంలోని ప్రతీ చెరువుకు చేరుకునేలా చూస్తానని హామీ ఇచ్చారు. 365 రోజులూ చెరువులను అలుగు పోయించడమే లక్ష్యమన్నారు. అన్నదాతలు ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు నల్లానాగిరెడ్డి, యూత్ నియోజకవర్గ కోఆర్డినేటర్ పసునూరి నవీన్, రైతు సమన్వయ సమితి మండల కో ఆర్డినేటర్ వీరమనేని యాకాంతారావు, కమ్మగాని రమేశ్, ఎండీ అబ్బాస్ అలీ, కమ్మగాని నాగన్న, మాచర్ల పుల్లయ్య, వేల్పుల దేవరాజు, మైదం జోగేశ్వర్, గుగులోత్ పార్వతి పాల్గొన్నారు.

కంటికి రెప్పలా కాపాడుకుంటా
టీఆర్‌ఎస్ అమలు చేస్తున్న పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్న ప్రతీ కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటానని ఎమ్మెల్యే దయాకర్‌రావు హామీ ఇచ్చారు. మండలకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో రాయపర్తి మండలం మైలారం గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ ఈదులకంటి రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో పారుపాటి రాజేందర్‌రెడ్డి, సంది మహేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌తోపాటు 10 మంది కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తలు, నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రతీ గ్రామంలో గులాబీ జెండా ఎగురాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మైలారం గ్రామ అధ్యక్షుడు ఎలమంచ శ్రీనివాసరెడ్డి, రాయపర్తి మండల ప్రధాన కార్యదర్శి రంగు కుమార్‌గౌడ్ పాల్గొన్నారు.

81
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles