గులాబీ గుబాళింపు

Mon,January 14, 2019 01:50 AM

-తొలి విడతలో 18 జీపీలు ఏకగ్రీవం
-టీఆర్ మద్దతుదారులకే పట్టం
-రాజకీయాలకతీతంగా ఒక్కటైన గ్రామస్తులు
-కాంగ్రెస్ సహా ఇతర పార్టీలకు అభ్యర్థులు కరువు
జనగామ, నమస్తే తెలంగాణ: ‘ఐక్యమత్యమే మహాబలం’ అన్న నానుడిని పల్లె జనం నిజం చేస్తున్నారు. ఐక్యతతో గ్రామ స్వరాజ్యానికి బాట లు వేసుకోవచ్చు.. పల్లెలను మరింత ప్రగతిపథంలో నడిపించవచ్చు అని భావించి పల్లె పోరు లో వివాదాలకు దూరంగా అంతా ఒక్కతాటిపైకి వచ్చారు. ‘ఒకే మాట.. ఒకే బాట’ నినాదంతో తమ గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించేందుకు రాజకీయ భేషజాలను పక్కకుబెట్టి గులాబీ పార్టీ మద్దతుదారులకు జైకొట్టారు. జిల్లాలో ఈ నెల 21న మొదటి విడత 5 మండలాల పరిధిలోని 100 జీపీల్లో ఎన్నికలు జరగనుండగా, ఆదివారం నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. ఇందులో 18 గ్రామ పంచాయతీ పాలకవర్గాలు ఏకగ్రీవమయ్యాయి. ఈ అభ్యర్థులు టీఆర్ బలపర్చిన వారు కావడం విశేషం. దీంతో 18 గ్రామాల్లో గులాబీ జెండా రెపరెపలాడింది.
యువత అరంగేట్రం..
కొత్తగా గ్రామ పంచాయతీలుగా రూపుదిద్దుకున్న తండాల్లో నవతరం యువత ఏకగ్రీవ సర్పంచ్ వార్డు సభ్యులుగా పల్లె రాజకీయాల్లో అరంగేట్రం చేసింది. నామినేషన్ల ప్రక్రియ ముగిసిన ఐదు మండలాల పరిధిలోని 100 గ్రామ పంచాయతీలు, 906 వార్డులకు 18 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ సహా కొద్ది వార్డులు మినహా మెజార్టీ వార్డు సభ్యులు సైతం ఏకగ్రీవమయ్యారు. సర్పంచ్, వార్డు పదవులకు ఒక్కో నామినేషన్ దాఖలైన గ్రామాలు, అభ్యర్థులు ఉపసంహరించుకున్న గ్రామాలు, వార్డులను క్లస్టర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ఏకగ్రీవ పంచాయతీలుగా అధికారికంగా ప్రకటించారు. వీరంతా టీఆర్ బలపరిచిన అభ్యర్థులు కావడంతో పల్లెల్లో విజయోత్సవ సంబురాలను ఆదివారం రాత్రి జరుపుకున్నారు. ఇది శుభ పరిణామంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఏకగ్రీవ పంచాయతీలు ఇవే..
జనగామ మండలంలో కొత్త దీపక్ కీర్తి లక్ష్మీనర్సయ్య(వెంకిర్యాల), నర్మెట మండలంలో కున్సోత్ పావని(మాన్ బానోత్ అనిత (ఇసుకబాయితండా), లకావత్ కిరణ్ ఎర్ర మరియ(గుంటూరుపల్లి), బానోత్ రజిత (మల్కాపూర్), తరిగొప్పుల మండలంలో బీరెడ్డి జార్జిరెడ్డి (మరియపురం) బెల్లం రాజు (నర్సాపూర్), అర్జుల రమాదేవి(అబ్దుల్ బచ్చన్నపేట మండలంలో గంగం సతీశ్ కుందెన మల్లేశం(లింగంపల్లి), ఏలూరి మాధవి(నక్కవానిగూడెం), పిడుగు రాజు (లక్ష్మాపూర్), లింగాలఘనపురం మండలంలో మర్రి లక్ష్మి(సిరిపురం), దూసరి గణపతి(నేలపోగుల), గుజురోత్ చిన్నయాదమ్మ(ఏనెబావి), బోళ్ల సత్యనారాయణ(మంధోనిగూడెం) ఏకగ్రీవమయ్యారు.

568
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles