మూడు గ్రామాల్లో కొత్త పాలకవర్గాలు

Mon,January 14, 2019 01:48 AM

తరిగొప్పుల: మండలంలోని 15 గ్రామ పంచాయతీలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిశాక మూడు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించి, వారికి నియామక ఉత్తర్వులు అందజేశారు. మరియాపురం సర్పంచ్ బీరెడ్డి జార్జిరెడ్డి, ఉప సర్పంచ్ చాట్లజోసఫ్, అదేవిధంగా వార్డు సభ్యులుగా తిరుమలరెడ్డి సుందరి, తానుగుండ్ల చిన్నపరెడ్డి, పొలిశెట్టి జోసఫ్, తమ్మ సునీత, చాట్లజోసఫ్, రాజబోయి అనసూర్య, బీరెడ్డి స్వర్ణ, ఏరువ చిన్నపరెడ్డి ఏకగ్రీవమయ్యారు. నర్సాపూర్ సర్పంచ్ బెల్లం రాజు, ఉప సర్పంచ్ అల్లిబిల్లి మహేందర్, వార్డు సభ్యులుగా ఎర్రం శిరీష, బాషబోయిన వెంకన్న, ఇర్మల్ల మల్లేశ్, గుంటి వెంకటమ్మ, ఎర్రవెల్లి బాలమ్మ, జోడుముంతల లక్ష్మి, అల్లిబిల్లి మహేందర్, ఎంగల గట్టయ్య నియామక పత్రాలు అందుకున్నారు. అబ్దుల్ సర్పంచ్ అర్జుల రమాదేవి, ఉప సర్పంచ్ బాషబోయిన రాజు, వార్డు సభ్యులుగా బండ శైలజ, పల్లె రవి, ఏదునూరి సావిత్రి, బాషబోయిన రాజు, మేకల సతీశ్, మామిడాల ఐలయ్య, నీల లావణ్య, బానోత్ మాధవి వార్డు సభ్యులుగా అధికారుల నుంచి ఉత్తర్వులు అందుకున్నారు. అబ్దుల్ సర్పం చ్ అర్జుల రమాదేవి సంపత్ ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. మరియాపురంలో గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో గ్రామస్తుల సమక్షంలో సమావేశం నిర్వహించారు. దీంతో గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. కార్యక్రమంలో టీఆర్ మండల అధ్యక్షుడు పింగిళి జగన్మోహన్ అర్జుల సుధాకర్ తాళ్లపల్లి పోషయ్య, రాజేశ్వర్, సత్తయ్య, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

86
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles