జోరుగా రెండో విడత నామినేషన్లు..


Sun,January 13, 2019 03:12 AM

-రెండో రోజు 397
-సర్పంచ్ స్థానాలకు 89
-వార్డు సభ్యుల పదవులకు 308 దాఖలు
జనగామ, నమస్తే తెలంగాణ, జనవరి 12 : జిల్లాలో రెండో విడత ఎన్నికలు జరిగే గ్రామపంచాయతీకు సంబంధించి శనివారం రెండోరోజు సర్పంచ్, వార్డు సభ్యుల పదవుల కోసం అభ్యర్థులు జోరుగా నామినేషన్లు వేశారు. ఈనెల 25న గుండాల, దేవరుప్పుల, కొడకండ్ల, రఘునాథపల్లి మండలాల్లో రెండో విడత ఎన్నికలు జరుగనున్నాయి. ఇందుకోసం ఈనెల 11 నుంచి 13 తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తున్నారు. మొదటి రోజు శుక్రవారం సర్పంచ్, వార్డు సభ్యులకు మొత్తంగా 207 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో 109 గ్రామ పంచాయతీలకు 83 మంది, 966 వార్డు సభ్యులకు గానూ 124 మంది ఆయా కేంద్రాల్లో నామినేషన్లు సమర్పించగా, రెండోరోజు శనివారం సర్పంచ్, వార్డు సభ్యులకు మొత్తం 397 మంది నామినేషన్లు వేయగా, ఇందులో సర్పంచ్ పదవుల కోసం 89 మంది, వార్డు సభ్యులుగా 308 మంది నామినేషన్లు వేశారు. కాగా, మొదటి విడత నామినేషన్ల ఉపసంహర ణకు ఆదివారంతో గడువు ముగియనుంది.


397 నామినేషన్లు..
జిల్లాలో 13 మండలాలు, 301 గ్రామ పంచాయతీలు, 2746 వార్డు సభ్యులకు గానూ మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు అధికార యంత్రాంగం మెదటి విడత ఐదు మండలాలు (జనగామ, బచ్చన్నపేట, నర్మెట, తరిగొప్పుల, లింగాలఘనపురం), రెండో విడత నాలుగు (దేవరుప్పుల, కొడకొండ్ల, రఘునాథపల్లి, గుండా ల) మండలాలు, మూడో విడత మిగిలిన నాలుగు ( స్టేషన్ ఘన్ చిల్పూర్, జఫరగఢ్, పాలకుర్తి ) మండలాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టింది. రెండోరోజు నామినేషన్ల ప్రక్రియలో భాగంగా దేవరుప్పుల మండలంలోని 32 పంచాయతీలకు గానూ సర్పంచ్ పదవులకు 22మంది, 274 వార్డు సభ్యులకు 74 మంది నామినేషన్లు దాఖలు చేశారు. రెండురోజులు కలిపి మొత్తం సర్పంచ్ పదవి కోసం 55 మంది, వార్డు సభ్యుల పదవి కోసం 126 మంది నామినేషన్లు వే శారు.

గుండాల మండలంలోని 20 గ్రామ పంచాయతీలకు రెండోరోజు 11మంది సర్పంచ్ అభ్యర్థులు, 182 వార్డు సభ్యుల పదవులకు 64 మంది నామినేషన్లు దాఖలు చేయగా, మండలంలో ఇప్ప టి వరకు సర్పంచ్ పదవులకు 30 మంది, వార్డు సభ్యుల కోసం 94మంది నామినేషన్లు దాఖలు చేశారు. కొడకండ్ల మండలంలో 21 పంచాయతీలకు సర్పంచ్ పదవులకు 17 మంది, 190 వార్డులకు 22 మంది నామినేషన్లు వేయగా, ఇప్పటి వరకు సర్పంచ్ పదవులకు 23మంది, వార్డు స భ్యుల పదవి కోసం 23 మంది నామినేషన్లు వేశారు. రఘునాథపల్లి మండలంలోని 36 గ్రామ పంచాయతీలకు గా నూ రెండోరోజు 39 మంది సర్పంచ్ అభ్యర్థులు, 320 వార్డులకు 148 మంది నామినేషన్లు వేయగా, ఇప్పటి వరకు సర్పంచ్ పదవులకు 74 మంది, వార్డు సభ్యుల కోసం 199 మంది నామినేషన్లు దాఖలు చేశారు.

నామినేషన్ సెంటర్ తనిఖీ చేసిన కలెక్టర్
దేవరుప్పుల, జనవరి 12 : మండలంలోని కోలుకొండ క్లస్టర్ నామినేషన్ సెంటర్ శనివారం కలెక్టర్ వినయ్ పరిశీలించి ఎన్నికల అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నామినేషన్ ఎన్నికల సిబ్బంది నామినేషన్ వే యడానికి వచ్చే ప్రతీ వార్డు సభ్యుడు, సర్పంచ్ అభ్యర్థులకు పూర్తి సహకారాన్ని అందించాలని సూచించారు. ఆదివారం నామినేషన్ల రద్దీ పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో దేవరుప్పుల మండల పరిధిలో ఉన్న 7 సెంటర్ల లో ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా పోలీసుల రక్షణ పెంచాలని అధికారులను ఆదేశించారు. నిరక్షరాస్యులు నామినేషన్ కేంద్రాలకు వస్తే రిటర్నింగ్ అధికారి సహకరించి, సరైన పత్రాలు సమర్పించేలా చూడాలన్నారు. అన్ని సెంటర్ల పనితీరుపై ఎంపీడీవో ఎప్పటికప్పుడు సమాచారం సేకరించాలన్నారు. కలెక్టర్ వెంట ఎంపీడీవో రాధాకృష్ణకుమారి, రిటర్నింగ్ అధికారి శ్రీనివాసరావు, ఎంపీడీవో సిబ్బంది ఉమామహేశ్వర్, పంచాయతీ సెక్రటరీ ప్రవీణ తదితరులు ఉన్నారు.

132

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles