2,95,180 మందికి కంటి పరీక్షలు

Sun,January 13, 2019 01:19 AM

జనగామ టౌన్/జనగామరూరల్/దేవరుప్పుల : జిల్లాలో కంటి వెలుగు పథకం శరవేగంగా కొనసాతూ 88రోజులకు చేరుకుంది. మంగళవారం జిల్లాలో కొనసాగిన శిబిరాలల్లో 3481 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా 381 మందికి అద్దాలు పంపిణీ చేశారు. మరో 100 మందిని శస్త్రచికిత్సల కోసం గుర్తించారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలో మొత్తంగి 88 రోజుల్లో 2, 95, 180 మందికి స్కీనింగ్ చేసి 37,008 మందికి అద్దాలు అందించి 9,253 మందిని శస్త్రచికిత్స ల కోసం గుర్తించి ఇప్పటి వరకు 289 మందికి శస్త్రచికిత్సలు నిర్వహించినట్లు వైద్యాధికారులు తెలిపారు. జనగామ మండలంలోని ఎర్రగొల్లపహడ్ నిర్వహించిన శిబిరంలో 255 మందికి కంటి పరీక్షలు నిర్వహించి 24 మందికి అద్దాలు అందించి, తొమ్మిది మందిని శస్త్ర చికిత్స కోసం గుర్తించినట్లు డాక్టర్ కల్పనాదేవి తెలిపారు. దేవరుప్పుల మండలంలోని అప్పిరెడ్డిపల్లిలో నిర్వహించిన కంటి వెలుగు శిబిరంలో 124 మందికి కంటి పరీక్షలు చేసినట్లు మండల వైద్యాధికారి అశోక్ తెలిపారు. 58 మందికి కంటి అద్దాల కోసం, 12 మందిని శస్త్ర చికిత్సల కోసం గుర్తించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమాల్లో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

76
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles