కేసీఆర్ కిట్ డాటాబేస్ ఎంట్రీలో జిల్లా టాప్


Sun,January 13, 2019 01:19 AM

జనగామటౌన్, జనవరి 08 : సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్ పథకం డాటాబేస్ రాష్ట్రంలోనే జనగామ జిల్లా తొలిస్థానంలో నిలిచిందని జిల్లా వైద్యాధికారి ఏ మహేందర్ తెలిపారు. జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మహేందర్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్ పథకంలో గర్భిణుల వివరాలను అన్ చేయడంలో రాష్ట్రంలోనే జనగామ జిల్లా తొలిస్థానంలో నిలవడం సంతోషకరంగా ఉందన్నారు. ఇంతకుముందు కేసీఆర్ కిట్ డాటాను కంప్యూటరీకరణ చేసేందుకు 13 మండలాలలో ఒక్కొక్కరు మాత్రమే ఉండేవారన్నారు. దీనివల్ల గర్భిణుల వివరాలను అన్ చేయడంతో కొంత ఇబ్బందులు ఏర్పడేదని, ఇప్పుడున్న వైద్యవిధాన కమిషనర్ యోగితారాణి ఈ డాటాబేస్ పద్ధతిని పీహెచ్ నుంచి తీసేసి నేరుగా ఏఎన్ శిక్షణలిచ్చి ట్యాబ్ అందిందించినట్లు చెప్పారు. దీంతో కేసీఆర్ కిట్ డాటా ఎంట్రీ విధానములో జిల్లా తొలి స్థానంలో నిలిచినట్లు తెలిపారు. ఇందుకు వైద్య విధాన కమిషనర్ కమిషనర్ యోగితారాణి ఇక్కడి వైద్యాధికారులను అభినందించినట్లు పేర్కొన్నారు. కేసీఆర్ కిట్ జిల్లా వ్యాప్తం గా 2జూన్ 2017 నుంచి 7జనవరి2019 వరకు 10,228 మంది గర్భిణులు డాటాబేస్ విధానంలో నమోదై ఉండగా, అందులో 5586 మందికి ప్రసవాలు జరిగినట్లు తెలిపారు. అలాగే 5139 మంది కేసీఆర్ కిట్ అర్హులు కాగా అందులో 4179 మందికి కేసీఆర్ కిట్ నగదును బ్యాంకుల్లో జమ చేసినట్లు వివరించారు. మరో 892 మందికి రావాల్సి ఉందని తెలిపారు. అలాగే 3.5నెలల 9710 మంది చిన్నపిల్లలకు, 7968 మంది 10మాసాల పిల్లలకు టీకాలను అందించినట్లు ఆయన తెలిపారు. మొత్తంగా జిల్లా ప్రజలు ప్రభుత్వ వైద్యసేవలను వినియోగించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కేసీఆర్ ఇన్ రాజశేఖర్, వైద్యాధికారి సీసీ ప్రభాకర్ పాల్గొన్నారు.

75

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles