కాజీపేట మీదుగా సంక్రాంతి స్పెషల్ రైళ్లు


Sun,January 13, 2019 01:19 AM

కాజీపేట : దక్షిణ మధ్య రైల్వే సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్ నుంచి కాజీపేట రైల్వే జంక్షన్ మీదుగా విశాఖపట్నానికి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. సికింద్రాబాద్-విశాఖపట్నం- సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ల మధ్య నడిచే స్పెషల్ రైలు (విజయవాడకు వెళ్లకుండ) (వయా) రాయంపాడు స్టేషన్ మీదుగా విశాఖపట్నానికి నడుస్తాయని తెలిపారు. ఈ సెక్షన్ (రూట్)లో రైల్వే శాఖ మొత్తం 12 స్పెషల్ రైళ్లను నడిపిస్తున్నారని రైల్వే అధికారులు తెలిపారు. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం మధ్య 08504 నంబర్ జనవరి 17న సాయంత్రం నాల్గున్నరకు బయలుదేరి మరునాడు ఉదయం ఐదు గంటలకు విశాఖపట్నంకు చేరుకుంటుందని తెలిపారు. అదే విధంగా 08503 నంబర్ విశాఖ పట్నంలో జనవరి 09, 16 తేదీల్లో రాత్రి 11 గంటలకు బయలు దేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుందని తెలిపారు.


ఈ రైళ్లు రాక, పోకలలో తుని, సామర్లకోట, తాడేపల్లిగూడెం, ఏలూరు, రాయంపాడు, ఖమ్మం, వరంగల్, కాజీపేట రైల్వే స్టేషన్లలో ఆగుతాయి. సికింద్రాబాద్ జనవరి 14, 18, 21 తేదీల్లో సాయంత్రం నాల్గున్నరకు 08506 నంబర్ గల స్పెషల్ రైలు బయలుదేరి మరుసటి రోజు ఉదయం ఐదు గంటలకు విశాఖపట్నానికి చేరుకుంటుందని తెలిపారు. తిరుగు ప్రయాణంలో విశాఖపట్నంలో 11, 13, 17, 20 తేదీల్లో 08505 నంబర్ రాత్రి 11 గంటలకు బయలుదేరి మరుసటి రోజు 12 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ స్పెషల్ రైలు రాక, పోకలో దువ్వాడ, అనకాపల్లి, తుని, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, రాయంపాడు, ఖమ్మం, వరంగల్, కాజీపేట రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. సికింద్రాబాద్ -విశాఖపట్నం మధ్య సువిధ స్పెషల్ రైళ్లను నడిపిస్తున్నారు. ఈ రైలు 82731, 82732 నంబర్ సికింద్రాబాద్ జనవరి 10, 12న సాయంత్రం నాల్గున్నరకు బయలుదేరి మరుసటి రోజు తెల్లవారు జా మున ఐదుగంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ రైలు కాజీపేట రైల్వే జంక్షన్, వరంగల్, ఖమ్మం, రాయంపాడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, తుని, అనకాపల్లి, దువ్వాడ రైల్వే స్టేషన్లలో ఆగుతుందని తెలిపారు. సికింద్రాబాద్- విశాఖపట్నం- సికింద్రాబాద్ మధ్య నడిచే స్పెషల్ రైళ్లను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇప్పటికే రిజర్వేషన్ బుకింగ్ ప్రారంభమైనట్లు తెలిపారు.

111

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles