కేటీఆర్ సీఎం కావాలన్నదే ప్రజల ఆకాంక్ష


Sun,January 13, 2019 01:18 AM

బచ్చన్నపేట, జనవరి 08 : సీఎంగా కేసీఆర్ తనయుడు కేటీఆర్ కావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. మండలంలోని లింగంపల్లికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పొన్నాల శ్రీశైలం సహా 150 మంది కార్యకర్తలు మంగళవారం టీఆర్ చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ముత్తిరెడ్డి మాట్లాడుతూ 60 ఏళ్లు తెలంగాణ సర్వ సంపదను దోచుకున్న సీమాంధ్రుల కబంద హస్తాల నుంచి విముక్తి చేసిన ఘనత కేసీఆర్ దక్కిందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఆదర్శ పాలనను ప్రజలు స్వాగతిస్తున్నారని, అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు టీఆర్ బ్రహ్మరథం పట్టారని అన్నారు. దేశ రాజకీయాల్లో కేసీఆర్ సేవలు అవసరమని ప్రజలు గుర్తిస్తున్నారని, అందుకే కేసీఆర్ దేశ రాజకీయాల వైపు దృష్టి పెట్టారని అన్నారు. దేశంలో కేసీఆర్ ప్రాధాన్యత పెరిగితే రాష్ట్రం మరింత అభివృదిద్ధి పథంలో దూసుకెళ్లే అవకాశం ఉందన్నారు. అందులో భాగంగానే సీఎంగా కేటీఆర్ బాధ్యతలు అప్పగించాలని కోరారు. తద్వారా ప్రాజెక్టులు పూర్తి కావడంతో సంక్షేమ, అభివృద్ధి పథకాలు మరిన్ని అమలు చేసే వీలుందన్నారు. కేసీఆర్ చేపట్టే ప్రతీ పని ప్రపంచ దేశాలకే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. రైతుబంధు పథకం ఇతర రాష్ర్టాలు సైతం అమలు చేసేందుకు ముందుకు వస్తున్నాయన్నారు.


నియోజకవర్గంలోని 128 గ్రామ పంచాయతీల్లో గులాబీ జెండాలు ఎగురవేయడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇందులో ఇప్పటి వరకు 25 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు చెప్పారు. మరో నలభై ఏకగ్రీవమయ్యేలా ఆయా గ్రామాల నాయకులు వ్యూహరచనలు చేస్తున్నారన్నారు. ప్రతీ గ్రామంలో టీఆర్ బలపర్చిన అభ్యర్థులు పోటాపొటీగా బరిలో ఉంటుండగా కాంగ్రెస్ పార్టీకి కనీసం అభ్యర్థులు కరువయ్యారని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే అన్ని గ్రామాల్లో టీఆర్ బలపర్చిన అభ్యర్థులనే గెలిపించాలని కోరారు. అనంతరం లింగంపల్లికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పొన్నాల శ్రీశైలం, బండి అయిలయ్య, బండి కృష్ణ, మేడబోయిన కనకయ్య, యాదయ్య, కనుకయ్య సహా 150 మంది ముత్తిరెడ్డి సమక్షంలో టీఆర్ చేరారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్ ఇర్రి రమణారెడ్డి, రాష్ట్ర నాయకుడు ముక్కెర తిరుపతిరెడ్డి, టీఆర్ మండల అధ్యక్షుడు చెంద్రారెడ్డి, ఎంపీపీ మహేశ్, వైస్ ఎంపీపీ మల్లారెడ్డి, జెడ్పీటీసీ భర్త వేముల విద్యాసాగర్, నక్కపిట్టల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాలియ చిట్టిబాబు, నాయకులు సతీష్ నరేందర్, మహేశ్, ఉపేందర్ జావీద్, సంతోష్, బొమ్మెన ఆంజనేయులు, పస్తం జలందర్, ఆంజయ్య, బాలసిద్దులు, మహేందర్, కైసర్, మోహన్ దస్తగిరి, జావీద్, వినోద్, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

77

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles