ఎన్నికల నేపథ్యంలో పోలీసుల కవాతు


Fri,November 16, 2018 01:34 AM

దేవరుప్పుల, నవంబర్ 15 : ఎన్నికలు శాంతియువ వాతావరణంలో జరిగేలా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ముందస్తు చర్యల్లో భాగంగా గురువారం మండలంలోని చినమడూరు, పెదమడూరు, కడవెం డి, దేవరుప్పులలో కేంద్ర బలగాలు కవాతు ని ర్వహించాయి. ఏసీపీ మధుసూదన్, పాలకుర్తి సీ ఐ రమేశ్ పర్యవేక్షణలో ఈ కవాతు జరుగగా బలగాలు పురవీధుల్లో ఆధునిక తుపాకులతో సంచరించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో నిబంధనలు వ ర్తిస్తాయని, అతిక్రమిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. మరోవైపు ఓటర్లు నిర్భయంగా త మ ఓటు హక్కును వినియోగించుకునేలా శాం తిభద్రతల విషయంలో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోలీసుశాఖ అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. సంఘ విద్రోహశక్తులు సంచరించినట్టు అనుమానం వస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రచార విషయంలో అన్ని పార్టీలు ఎన్నిలక నియమావళి పాటించాలని కోరారు. కార్యక్రమాన్ని ఎస్సై రవికుమార్ పర్యవేక్షించగా, పోలీసులు ఉమాకర్, పాపయ్య, అశోక్, సురేశ్ పాల్గొన్నారు.

122
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles

మరిన్ని వార్తలు...