కూటమిని తరిమికొట్టాలి

Thu,November 15, 2018 01:46 AM

స్టేషన్‌ఘన్‌పూర్ నమస్తేతెలంగాణ/ స్టేషన్‌ఘ న్‌ఫూర్‌టౌన్, నవంబర్ 14 : పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్‌లో జరగబో యే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి వస్తున్న మహాకూటమి.. కాదు మాయలకూటమిని ప్రజలు తరిమికొట్టాలని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలంగాణ ప్రజలను కోరారు. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ కేంద్రం లో బుధవారం టీఆర్‌ఎస్ అభ్యర్థి, మాజీ ఎమ్మె ల్యే డాక్టర్ రాజయ్య నామినేషన్ దాఖలు చేశా రు. అనంతరం టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం స మీపంలో ఏర్పాటు చేసిన ప్రచారరథంపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడారు. పారాచూట్ నాయకులు ఢిల్లీకి వెళ్లి టికెట్ కోసం లైన్లో నిల్చునే పరిస్థితి నుంచి అమరావతిలో టికెట్లను కేటాయించే పరిస్థితికి మహాకూటమికి దిగజారిందన్నారు. స్వతంత్ర తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక నాలుగున్నరేళ్ల కాలంలోనే దేశంలోనే అభివృద్ధి పరంగా సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని నంబర్‌వన్ స్థానంలో నిలిపి ఉత్తమ సీఎంగా గు ర్తింపు పొందారన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, తాజామాజీ ఎమ్మెల్యే డాక్టర్ టీ రాజయ్య, ఎమ్మె ల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అనే ముగ్గురు నాయకులు ఉన్నారన్న విషయాన్ని ప్రజలు మరిచిపోవద్దన్నారు. ఈ ఎన్నికల్లో డాక్టర్ టీ రాజయ్యకు మ ద్దతు తెలిపితే ముగ్గురం నాయకులం కలిసి ని యోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తామన్నారు. 2014ఎన్నికల్లో డాక్టర్ రాజయ్య ఈ నియోజక వర్గం నుంచి పోటీ చేయగా, తాను ఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తే ఒకలక్షా 60 వేల ఓట్లు పోలయ్యాయని, అందులో 90వేల ఓట్ల మెజార్టీ రాగా, ఈ నియోజకవర్గం నుంచే అధిక ఓట్లు పో లైనట్లు ఆయన గుర్తుచేశారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వృద్ధులకు వెయ్యి, వికలాంగులకు రూ.1500 పింఛన్లు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కు ద క్కుతుందన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా మ్యానిఫెస్టోను ప్ర కటించారని, ఆ మ్యానిఫెస్టోలో వృద్ధులకు వె య్యి నుంచి రూ. 2016, వికలాంగులకు రూ. 3016, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కింద రూ.3వేలు అందిస్తామని ప్రకటించారన్నారు. రైతుల సంక్షే మం కోసం ఎకరానికి రూ.3వేల పెట్టుబడిని రూ.10వేలకు పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారన్నారు. తెలంగాణలో మరింత అభివృద్ధి జరుగాలంటే కేసీఆర్ సీఎం కావాలని, ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ టీ రాజయ్య ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని ఆయన కోరారు. స్టేషన్‌ఘన్‌ఫూర్ నియోజకవర్గంలోని లింగంపల్లిలో అతిపెద్ద రిజర్వాయర్‌ను ఏర్పాటు చేసుకోబోతున్నామని, రూ.3వేల220 కోట్లతో టెండర్లు కూడా పూర్తయ్యాయని తెలిపారు. వచ్చే మూడేళ్లలో రిజర్వాయర్‌ను పూర్తి చేసి నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకూ రెండు పంటలకు సాగునీరు అందించి, నియోజకవర్గాన్ని మరో కోనసీమ చేస్తామని ఆయన తెలిపారు.

ఈ నియోజకవర్గంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి భారీ లెదర్‌పార్క్ రాబోతుందన్నారు. 2019-2020 విద్యా సంవత్సరంలో నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలనే ఏర్పాటు చేసుకోబోతున్నట్లు ఆయన తెలిపారు. నియోజకవర్గంలోని కొన్ని గ్రామాల్లో దేవాదుల ద్వారా చెరువులను నింపుకోలేకపోయామని, గోదావరి జలాల ద్వారా మూడు లిప్టులు వచ్చే అవకాశం ఉన్నందున అన్ని గ్రామాల్లోని చెరువులను నింపుతామని ఆయన తెలిపారు. టీఆర్‌ఎస్ అందించిన సంక్షేమ పథకాలు నియోజక వర్గంలోని ప్రతీ కుటుంబానికి చేరాయని, ప్రతీ టీఆర్‌ఎస్ కార్యకర్త ఎన్నికల ప్రచారంలో ప్రతీ లబ్ధిదారుడిని కలిసి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరించి ఓటు వేయించేలా విస్తృత ప్రచారం చేయాలని ఆయన కోరారు. ఎన్నికల నాటికి నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ ఎన్నికల బహిరంగసభ ఉంటుందని ఆయన తెలిపారు.

అభివృద్ధి చేశా.. మద్దతు తెలుపండి: ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ టీ రాజయ్య
స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో కోట్ల రూపాయలతో అభివృద్ధిని చేశానని, ఈ ఎన్నికల్లో కూడా ప్రజలు తనను ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేస్తానని టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ టీ రాజయ్య కోరారు. నియోజకవర్గంలో మహాకూటమి అడ్రస్ లేదని, ఉన్నదల్లా టీఆర్‌ఎస్ పార్టీ మాత్రమేనని ఆయన తెలిపారు. నియోజక వర్గంలోని గ్రామాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచార సభలను నిర్వహిస్తామని, ప్రచారంలో అపద్ధర్మ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి పాల్గొంటారని ఆయన తెలిపారు. కారు..కేసీఆర్..సర్కార్.. అనే నినాదంతో లక్ష ఓట్ల మెజార్టే లక్ష్యంగా గెలిపించాలని ఆయన నియోజక వర్గ ప్రజలను కోరారు.

కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎడవెల్లి కృష్టారెడ్డి, కార్పొరేటర్లు జోరిక రమేశ్, సీనియర్ న్యాయవాది పరంజ్యోతి, జెడ్పీటీసీ భూక్య స్వామినాయక్, ఎంపీపీ వంగాల జగన్‌మోహన్‌రెడ్డి, నాయకులు సీహెచ్ నరేందర్‌రెడ్డి, అన్నెం బ్రహ్మారెడ్డి, బెలిదె వెంకన్న, నీల గట్టయ్య, బూర్ల శంకర్, కర్ర సోమిరెడ్డి, పాగాల సంపత్‌రెడ్డి, గుర్ర పు వెంకటేశ్వర్లు, జనగామ యాదగిరి, మండల పార్టీ అధ్యక్షుడు పోగుల సారంగపాణి, ఆకుల కుమార్, టీ సురేశ్‌కుమార్, గట్టు చేరాలు, బంగ్లా శ్రీనివాస్, తోట సత్యం, మునిగెల రాజు, కుంభం కుమారస్వామి, చెరిపల్లి రామల్లు, సున్నం యాదగిరితోపాటు నియోజక వర్గంలోని ఆయా మండలాల ప్రజాప్రతినిధులు, మాజీ సర్పంచ్‌లు, ఎం పీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

146
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles