హస్తంలో అసంతృప్తి

Wed,November 14, 2018 02:29 AM

-టికెట్ల ఖరారుతో అసమ్మతి రాగం
-బరిలో ఉంటామంటున్న ఆశావహులు
-స్టేషన్ ఘన్‌పూర్ నుంచి విజయరామారావు, మాదాసి
-పాలకుర్తి నుంచి బిల్లా, అశోక్‌కుమార్
-జనగామ నుంచి మొగుళ్ల రాజిరెడ్డి?
-అభ్యర్థుల ఆందోళన, శ్రేణుల్లో నైరాశ్యం
జనగామ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను రెబెల్స్ బెడద వెంటాడుతోంది. మహాకూటమి పొత్తులో భాగంగా టికెట్లు దక్కించుకున్నప్పటికీ సొంత పార్టీ నేతలతో ఇబ్బందులు తప్పేట్లులేదు. జిల్లాలోని మూడు నియోజకవర్గాలకు గానూ ఇప్పటికే జనగామ మినహా పాలకుర్తి, స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. పాలకుర్తికి జంగా రాఘవారెడ్డి, స్టేషన్ ఘన్‌పూర్ నుంచి సింగారపు ఇందిరకు కాంగ్రెస్ అధిష్టానం టికెట్లు ఖరారు చేసింది. జనగామ టికెట్‌పై ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఇక్కడి నుంచి టీజేఎస్ అధినేత కోదండరాం పోటీలో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు ఎసరు వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ కోదండారం టికెట్‌ను వదులుకుంటే పొన్నా ల అభ్యర్థిత్వానికి గ్యారంటీ లభించినట్లే. ఈ నేపథ్యంలో మూడు నియోజకవర్గాల నుంచి రెబెల్స్ బెడద తప్పేట్లు లేదనే సంకేతాలు స్పష్టంగా ఉన్నా యి. ఈ మూడు నియోజకవర్గాల నుంచి అధిక సంఖ్యలో ఆశావహులు టికెట్ కోసం అధిష్టానానికి దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికీ వారంతా తమకే టికెట్ ఇవ్వాలని గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. టికెట్ల కేటాయింపులపై అధిష్టానం మరోసారి పునరాలోచన చేయాలని విన్నవిస్తున్నారు. ఒకవేళ టికె ట్ దక్కని పక్షంలో పక్కాగా బరిలో ఉంటామంటు న్నారు. అభ్యర్థులు తమ విజయావకాశాలు దెబ్బతి నే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అసమ్మతి రాగం...
మహాకూటమిలో భాగంగా కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి అసమ్మతిరాగం వినిపిస్తోంది. టీఆర్‌ఎస్ ఓటమే లక్ష్యంగా కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐలు జట్టుకట్టిన విషయం తెలిసిందే. పొత్తుల నేపథ్యంలో కీలక స్థానాల నుంచి టికెట్లు ఆశిస్తున్న నేతలంతా అధినాయకత్వంపై గుర్రుగా ఉన్నారు. భాగస్వామ్య పక్షాలకు టికెట్లు కేటాయించే విషయంలో తమ స్థానం వదులుకోవాల్సి వస్తోందోననే సీనియర్లు ఆందోళన చెందుతున్నారు. మొదటి నుం చి అనుకున్నట్లుగానే టికెట్ల సర్దుబాట్ల విషయంలో అన్యాయం జరిగిందని పలువురు ఏకంగా ఢిల్లీకి వె ళ్లి లొల్లికి దిగారు. మరికొందరు గాంధీభవన్ వేదికగా ఆందోళనలు ఉధృతం చేస్తున్నారు. జనగామ టికెట్ ఎట్టి పరిస్థితుల్లో మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యకే కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. అ యితే మొదట్లో ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించిన పలువురు ద్వితీయశ్రేణి నాయకులు అధిష్టానాన్ని కలిసి టికెట్ ఇవ్వొదంటూ విన్నవించారు. తర్వాత జరిగిన పరిణామాల నడుమ వ్యతిరేకులం తా ఐక్యతారాగం అందుకున్నారు. దీంతో పొన్నాలకు టికెట్ ఖరారైందని ఆయన ప్రచారం జరుపుతున్న నేపథ్యంలో పొత్తులో భాగంగా ఇక్కడి నుంచి టీజేఎస్ అధినేత కోదండరాంను బరిలో నిలుపుతున్నట్లు ప్రచారం జరిగింది. దీంతో ఒక్కసారిగా కాం గ్రెస్ శ్రేణులు ఆందోళనకు గురయ్యారు.

పొన్నాల ను కాదని కోదండరాంకు టికెట్ ఇస్తే నియోజకవర్గాన్ని అగ్నిగుండంగా మారుస్తామని ప్రకటించారు. తాజాగా ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు చూస్తే మళ్లీ పొన్నాలకే టికెట్ వచ్చేలా ఉన్నాయనే వాదన లు వినిపిస్తున్నాయి. ఒకవేళ పొన్నాలకు కాకుండా ఇతరులకు టికెట్ కేటాయించినట్లయితే తాను కూ డా బరిలో ఉంటానని టీపీసీసీ అధికార ప్రతినిధి మొగుళ్ల రాజిరెడ్డి ప్రకటించినట్లు తెలుస్తోంది. స్టేషన్ ఘన్‌పూర్ అభ్యర్థి సింగారపు ఇందిరకు కూడా రెబె ల్స్ బెడద తప్పేట్లు లేదనే ప్రచారం జరుగుతోంది. ఇక్కడి నుంచి మాజీ మంత్రి, సీనియర్ నేత గుండె విజయరామారావు టికెట్ ఆశిస్తున్నారు. ఈయన తోపాటు మరో నాయకుడు మాదాసి వెంకటేష్ టికె ట్ రేసులో ఉన్నారు. అధిష్టానం దాదాపుగా విజయరామారావుకే టికెట్ ఖరారు చేస్తుందని కొద్దిరోజులుగా పార్టీ శ్రేణులు చెబుతూ వస్తున్నారు. లేని పక్షంలో ఇందిరకు టికెట్ ఇస్తారని ప్రచారంలో ఉంది. కాగా, ఇందిరకు టికెట్ ఖరారు కావడంతో ప్రస్తుతం విజయరామారావు బరిలో ఉంటానని స్పష్టం చేస్తున్నారు. మాదాసి వెంకటేష్ సైతం పోటీలో ఉంటానని నియోజకవర్గంలో ప్రచారం సైతం నిర్వహిస్తున్నాడు. అయితే ఇక్కడి నుంచి టీడీపీకీ చెందిన నా యకుడు ఎస్‌కే రాజు సోమవారం తొలి నామినేషన్ దాఖలు చేశారు. ఈ పరిణామాలన్నీ అభ్యర్థిని అ యోమయానికి గురిచేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ పా లకుర్తి నుంచి జంగా రాఘవారెడ్డికి టికెట్ ఖరారు చేసినప్పటికీ స్థానికంగా అసమ్మతి సెగ తప్పేట్లుగా కనిపించడం లేదు. ప్రధానంగా రాయపర్తికి చెందిన టీపీసీసీ కార్యదర్శి బిల్లా సుధీర్‌రెడ్డి జంగా రాఘవారెడ్డిని టార్గెట్ చేశారు. మొదటి నుంచి ఆయన అభ్యర్థితత్వాన్ని తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. జంగా రాఘవారెడ్డి ఆర్థిక నేరగాడు, రౌడీ, దోపిడీ దొంగ అని వ్యాఖ్యలు చేశారు. అతడి నేరాల చిట్టాతో కూడిన బుక్‌లెట్ విడుదల చేసి పార్టీలో కొత్త చర్చకు తెరలేపాడు. తొర్రూర్‌కు చెందిన మరో నేత అశోక్ కుమార్‌గౌడ్ పాలకుర్తి టికెట్ తనకే కేటాయించాలంటూ కొద్దిరోజులుగా ఢిల్లీలోని కాంగ్రెస్ భవన్ ఎదుట ఆందోళన నిర్వహిస్తున్నాడు. ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో నేతల మధ్య నెలకొన్న విభేదాలు, అసమ్మతి సెగలు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయోనని పార్టీ శ్రేణుల్లో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది.

141
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles