సంక్షేమంలో తెలంగాణ నంబర్ వన్

Wed,November 14, 2018 01:18 AM

-మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య
-జాగృతి ఆధ్వర్యంలో ఆత్మీయ సభ
రఘునాథపల్లి, నవంబర్ 13 : అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడంతోపాటు అమలు చేసి తెలంగాణను దేశంలోనే నంబర్ వన్‌గా నిలిపిన ఘనత టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కే దక్కుతుందని తాజా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. మండలంలోని కంచనపల్లి గ్రామంలో మంగళవారం జనగామ జిల్లా మహిళా జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ ఆశీర్వాద సభకు జాగృతి జిల్లా కన్వీనర్ కవిత అధ్యక్షత వహించగా రాజయ్య హాజరై మాట్లాడారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు, రైతులకు 24గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్, రైతు బంధు పథకం, కల్యాణలక్ష్మి, షాదీమూభారక్ లాంటి పథకాలు ప్రవేశపెట్టిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజల గుండెల్లో గూడుకట్టుకుందన్నారు. ఎన్ని మహాకూటమిలు అడ్డుపడినా టీఆర్‌ఎస్ గెలుపును ఎవరూ ఆపలేరని ఆయన అన్నారు. స్టేషన్‌ఘన్‌ఫూర్ నియోజకవర్గంను టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సహకారంతో అభివృద్ధి చేశానని, మరోసారి ఆశీర్వదించి గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని ఆయన అన్నారు. గతంలో డబుల్ బెడ్‌రూం ఇళ్లు నిర్మించుకోని వారి కోసం సొంత స్థలంలో డబుల్ బెడ్‌రూం నిర్మించుకుంటే రూ.6.20లక్షలు ఇస్తామని ఆయన అన్నారు.

గత పాలకుల వల్ల స్టేషన్‌ఘన్‌పూర్ వెనుకబాటుకు గురైందని, టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక స్టేషన్‌ఘన్‌పూర్ అభివృద్ధిలో నాలుగో స్థానంలో నిలిచిందన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలను ప్రజలకు వివరిస్తూ నేడు తనకు జాగృతి నాయకురాలు అండగా ఉండడం ఆనందంగా ఉందని అన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ లో టీఆర్‌ఎస్ జెండాను ఎగురవేసేందుకు సహకరించాలని గ్రామస్తులను కోరారు. అనంతరం రాజయ్య సమక్షంలో పలువురు వివిధ పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లోకి చేరారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ శారద, వైస్ ఎంపీపీ మల్కపురం లక్ష్మయ్య, రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యులు మారుజోడు రాంబాబు, జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బుచ్చయ్య, టీఆర్‌ఎస్ మహిళా మండల అధ్యక్షురాలు మడ్లపల్లి సునిత, మాజీ ఎంపీపీ కుమార్‌గౌడ్, రైతు సమన్వయ సమితి మండల కో-ఆర్డినేటర్ గొరిగె రవి, నాయకులు వారాల రమేశ్, గవ్వాని నాగేశ్వర్‌రావు, జోసఫ్, ప్యారపు రాములు, బుగ్గయ్య, రాజిరెడ్డి, నాగేశ్, పెద్దగోని రాజు, ద్వావర యాకయ్య, మాల్యానాయక్, జాగృతి నాయకురాలు కవిత, మంజుల, రేణుక, సాంబరాజు, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

134
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles