కార్తీక సందడి


Tue,November 13, 2018 01:54 AM

పాలకుర్తి, నవంబర్ 12 : శైవ క్షేత్రంలో ఒక్కటిగా నిలిచిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పాలకుర్తిలోని స్వయంభు శ్రీ సోమేశ్వర్వ లక్ష్మీనరసింహాస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి సోమేశ్వర స్వామిని దర్శించుకున్నారు. స్వామి వారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున క్యూలైన్లలో బారులు తీరారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. ఆలయంలో భక్తులు, మహిళలు కార్తీక దీపాలు వెలిగించారు. కొండపైన నెలకొన్న శిఖరం వద్ద గండ దీపం వెలిగించి పూజలు జరిపారు. పలువురు భక్తులు సోమన్నకు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించారు. కొండ దిగువన ఉన్న ఆంజనేయస్వామి, సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ కార్యనిర్వహణధికారి వీ రాజేందర్‌రావు ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో అర్చకులు దేవగిరి రామన్న, దేవగిరి లక్ష్మన్న, దేవగిరి రమేశ్‌శర్మ, దేవగిరి అనీల్‌కుమార్, మత్తగజం నాగరాజు, కొత్తపల్లి వెంకటయ్య, సిబ్బంది శ్రీనివాస్, రాములు, మెరుగు మధుసూదన్‌గౌడ్, అశోక్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

జనగామ పట్టణంలో..
జనగామ టౌన్, నవంబర్ 12 : శివునికి అత్యంత ప్రీతికరమైన పవిత్ర కార్తీక మాస తొలి సోమవారాన్ని పురస్కరించుకుని భక్తులు శివాలయాలకు పోటెత్తారు. ఈ సందర్భంగా జనగామ పాతబీట్‌బజార్‌లోని శ్రీరామలింగేశ్వరాస్వామి ఆలయంలో స్వామివారికి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బెల్లం పానకంతో అభిషేకం చేశారు. ఉదయం నుంచి రాత్రి వరకు భక్తులు పోటెత్తి మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే పట్టణంలోని జయశంకర్‌నగర్, వ్యవసాయమార్కెట్ హనుమాన్ ఆలయంలో, గీతా ఆశ్రమంలో, వీవర్స్‌కాలనీలలోని హనుమాన్ ఆలయంలో, హెడ్‌పోస్టాఫీస్ వద్ద ఉన్న సంతోషిమాత ఆలయంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆలయాలలో దీపారాధనలు, అభిషేకాలు, హారతులు, కుంకుమార్చనలు చేపట్టారు.

కార్యక్రమంలో రామలింగేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ రామిని రాజేశ్వర్, ఉపాధ్యక్షులు మహాంకాళి హరిశ్చంద్రగుప్తా, రామిని శ్రీనివాస్, కోశాధికారి అయిత శ్రీనివాస్, సభ్యులు బెలిదే శ్రీధర్, ఎర్రం మల్లికార్జున్, పబ్బా నాగేశ్వరరావు, పుల్లూరు శ్రీనివాస్, దారం సోమయ్య, పబ్బా చంద్రశేఖర్, రేణుకుంట కృష్ణ, రవి, వేణు, పూజారి శివరాజ్‌తోపాటు పట్టణంలోని పలు ఆలయాల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

బచ్చన్నపేటలో..
బచ్చన్నపేట : హరహర మహాదేవ.. శంభోశంకరా.. అంటూ భక్తులు స్వయంభూ సిద్ధేశ్వరుడిని వేడుకున్నారు. కార్తికమాసం తొలి సోమవారంను పురస్కరించుకుని మండలంలోని కొడవటూరు సిద్ధేశ్వరాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆలయం భక్తులతో కిటకిటలాడింది. కొండపై ఉన్న గుండాల్లో స్నానాలు ఆచరించి కొండ సొరికెల్లో కొలువుదీరిన స్వయంభూ సిద్ధేశ్వరుడికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ఈవో రత్నాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన పూజారి ఓంనమశివాయ, అర్చకులు సదాశివుడు, మహాశివుడు, సంగమేశ్వర్, ముక్తేశ్వర్, ఛరన్ తదితరులు ఆలయంలో పూజలు నిర్వహించారు. ఆలయంలో కొలువుదీరిన కాళభైరవస్వామి, గణపయ్యకు కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. నందీశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది చల్లా రాజేందర్‌రెడ్డి, మధు, లక్ష్మీకాంత్‌రెడ్డి, సుధారాణి, యాకమ్మ తదితరులు పాల్గొన్నారు.

124
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...