65మందితో కాంగ్రెస్ తొలి జాబితా

Tue,November 13, 2018 01:53 AM

-ఉమ్మడి వరంగల్‌లో ఏడు స్థానాలు ఖరారు..
వరంగల్ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : టీ కాంగ్రెస్ 65మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసింది. సోమవారం ఢిల్లీలో కుంతియా మీడియాకు ఈ జాబితాను వెల్లడించారు. ఆ జాబితా ప్రకారం వరంగల్ ఉమ్మడి జిల్లా విషయానికి వస్తే.. పరకాల స్థానానికి కొండా సురేఖ, నర్సంపేటకు దొంతి మాధవరెడ్డి, పాలకుర్తికి జంగా రాఘవరెడ్డి, డోర్నకల్‌కు జాటోత్ రామచంద్రునాయక్, మహబూబాబాద్‌కు పోరిక బలరాం నాయక్, స్టేషన్ ఘన్‌పూర్‌కు ఎస్ ఇందిరా, ములుగుకు సీతక్క పేర్లను ఖరారు చేశారు. మొత్తంగా 12 స్థానాలకు గాను ఏడుగురి పేర్లను ఖరారు చేశారు. ఇక మిగతా సీట్లను కూటమికి కేటాయిస్తారా? లేక మలివిడత జాబితాలో కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటిస్తారా? అన్నది వేచిచూడాలి.

147
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles