దయన్న గెలుపు అభివృద్ధికి మలుపు

Sun,November 11, 2018 01:12 AM

పాలకుర్తి రూరల్, నవంబర్ 10 : పాలకుర్తి టీఆర్‌ఎస్ అభ్యర్థి, అభివృద్ధి ప్రదాత, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్‌రావును భారీ మెజారిటీతో గెలిపించాలని సిరిసన్నగూడెం గ్రామ ఏరియా ఇన్‌చార్జి కమ్మగాని నాగన్న పిలుపునిచ్చారు. శనివారం మండలంలోని సిరిసన్నగూడెంలో టీఆర్‌ఎస్ శ్రేణులు ఇంటింటా ప్రచా రం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో కలియ తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తూ ప్రభు త్వ పథకాలతో పాటు ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా ఎర్రబెల్లి దయాకర్‌రావు చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ బోట్టుపెట్టి ఓటు అడిగారు. అనంతరం నాగన్న మాట్లాడుతూ ఎర్రబెల్లి గెలుపు అభివృద్ధికి మలుపు అన్నారు. ఎర్రబెల్లి జీవితం ప్రజాసేవకు అంకితమన్నారు. మచ్చలేని నాయకుడికి మరోసారి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధి కేవలం దయన్నతోనే సాధ్యమన్నారు. దేశ భవిష్యత్ యువత చేతిలో ఉందన్నారు. ప్రలోభాలకు లొంగకుండా అభివృద్ధి చేసే నాయకుడిని ఎన్నుకోవాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలే ఎర్రబెల్లిని భారీ మెజారిటీతో గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. దయన్నను నిండు మనస్సులో ఆశీర్వదించాలన్నారు. కార్యక్రమం లో గ్రామశాఖ అధ్యక్షుడు ఒంటెల శ్రీనివాస్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల మెంబర్ ఆవుల రవి, ఒంటెల మహేందర్‌రెడ్డి, గాయాల గురువయ్య, ఎల్లగౌడ్, తొట్టె కొమురుమల్లు, వెంకటేశ్, చిలువేరు రవి, వల్లాల సురేశ్, వంగాల మహిపాల్‌రెడ్డి, గొట్టె మల్లయ్య, గాయాల యాదగిరి, రాజిరెడ్డి, నాగార్జున్, కుమార్, చుంచు అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

150
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles