టీఆర్‌ఎస్‌లో భారీగా చేరికలు

Sun,November 11, 2018 01:10 AM

జనగామ, నమస్తే తెలంగాణ/బచ్చన్నపేట/నర్మెట, నవంబర్ 10 : వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు, నాయకులు శనివారం భారీ సంఖ్యలో టీఆర్‌ఎస్‌లో చేరారు. వీరికి జనగామ టీఆర్‌ఎస్ అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జనగామ పట్టణంలోని 14వ వార్డుకు చెందిన 100మంది మోచీ కులస్తులు శనివారం వార్డు అధ్యక్షులు పంతులు ప్రభాకర్‌రావు ఆధ్వర్యంలో మాజీ ఎమ్మె ల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సమక్షంలో జిల్లా కేంద్రంలోని లక్ష్మీ నర్సింహాస్వామి ఫంక్షన్‌హాల్‌లో జరిగిన కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్‌పర్సన్ బండ పద్మ, టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు బండ యాదగిరిరెడ్డి, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు పోకల లింగయ్య పాల్గొన్నారు.
నర్మెట : నర్మెట, తరిగొప్పుల మండలాల్లోని మల్కపేట, కన్నెబోయినగూడెం, వెల్దండ, ఇప్పలగడ్డ, తరిగొప్పుల మండలకేంద్రానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, ఎమ్మార్పీఎస్ నాయకులు సుమారు 120మంది కార్యకర్తలు ముత్తిరెడ్డి, బోడకుంటి వెంకటేశ్వర్లు సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు.
బచ్చన్నపేట : మండలంలోని చిన్నరామన్‌చర్లకు చెందిన టీడీపీ, కాంగ్రెస్ కార్యకర్తలు శుక్రవారం రాత్రి జనగామ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సమక్షంలో 50 మంది టీఆర్‌ఎస్‌లో చేరారు. గ్రామానికి చెందిన పీఏసీఎస్ డైరెక్టర్ మోకు నర్సిరెడ్డి, పాల కేంద్రం డైరెక్టర్ నిమ్మ నరేందర్‌రెడ్డి, యువజన సంఘం అధ్యక్షులు రామగళ్ల ఎల్లయ్యలతో పాటు పలువురు పార్టీలో చేరారు. వారి వెంట రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్ ఇర్రి రమణారెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు ముక్కెర తిరుపతిరెడ్డి, గ్రామశాఖ అధ్యక్షు లు జోగిరెడ్డి, నరేందర్, వైస్ ఎంపీపీ మల్లారెడ్డి, ఆంజనేయులు, ఉపేందర్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, జావీద్, షబ్బీర్, జనార్దన్ ఉన్నారు.

125
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles