గులాబీ దళపతే మళ్లీ సీఎం

Fri,November 9, 2018 02:53 AM

(వరంగల్ ప్రధాన ప్రతినిధి-నమస్తే తెలంగాణ) మహాకూటమి మాయలకు తెలంగాణ ప్రజలు అసలే ప్రాధా న్యం ఇవ్వడం లేదని ప్రజానాడీ స్పష్టం చేస్తోంది.వాళ్లు సీట్లు పంచుకునే లోపే మనం నియోజకవర్గాల్లో స్వీట్లు పంచుకుం టాం అని ప్రజా ఆశీర్వాద సభల్లో మంత్రి కేటీఆర్ జోస్యం చెప్పినట్లుగానే తాజా ఇండియా టుడే సర్వే తెలంగాణ ప్రజల నాడీని పట్టింది. ఎవరెన్ని చెప్పినా తెలంగాణలో మళ్లీ టీఆర్‌ఎసే అధికారంలోకి వస్తుందని ముఖ్యమంత్రిగా కేసీఆరే పగ్గాలు చేపడతారని ఇండియా టుడే సర్వే తేటతెల్లం చేసింది. 9 నెలల ముందు అసెంబ్లీని రద్దు చేసి ప్రజాక్షేత్రంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రజాకంటక విధానాలను ఎండగడుతున్న నేపథ్యంలో వచ్చిన ఎన్నికలు టీఆర్‌ఎస్‌కు అనుకూలమేనని సర్వే స్పష్టమైన సంకే తాలు ఇచ్చింది. కాంగ్రెస్ ప్రగతి నిరోధక విధానాన్ని ఎండ గడుతూ టీఆర్‌ఎస్ పార్టీ నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలు సూపర్ హిట్ అవుతున్నాయి. మునుపెన్న డూ లేని విధంగా కుల సంఘాలు, వివిధ వర్గాల ప్రజలు నాలు గున్నర సంవత్స రాలుగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఆకర్షితులవుతూ టీఆర్‌ఎస్‌కు మద్దతు తెలుపుతున్నారు.

మరోవైపు 105 మంది అభ్యర్థులను ఏక కాలంలో ప్రకటించిన పార్టీలో కేడర్, లీడర్ మధ్య సమన్వయం లేదనే అంశానికి తావివ్వకుండా.. కార్యకర్త నుంచి అభ్యర్థి దాకా ఐక్యతతో గులాబీ శ్రేణులు ముందుకు వెళ్తున్నాయి. అదే కాం గ్రెస్, టీడీపీ, తెలంగాణ జనసమితి, సీపీఐ, తెలంగాణ ఇంటి పార్టీలు జత కలిసి టీఆర్‌ఎస్‌ను ఒంటరిగా ఎదిరించలేని స్థితి నెలకొంది. గురువారం వరకూ కూటమి పార్టీల సీట్ల సర్దు బాటు కొలిక్కి రాలేదు. ఇంకా అభ్యర్థుల ప్రకటనకు మహా కూటమి తాజాగా ఈనెల 10న ముహూర్తం పెట్టుకుంది. అప్ప టికీ అభ్య ర్థుల ప్రకటన వస్తుం దో లేదో కూడా స్పష్టత లేదు. ఇటు వంటి పరిస్థితుల నేపథ్యం లో ఇండియా టుడే తెలంగాణలో మళ్లీ టీఆర్‌ఎస్‌కే అధికారం ప్రజలు కట్టబెట్టబోతున్నారని స్పష్టం చేసింది. ఈ ఇండియా టు డే సర్వే తెలంగాణవాదుల్లో, ప్రత్యే కించి టీఆర్‌ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపుతోంది.

అనూహ్యంగా పెరిగిన మద్దతు
టీఆర్‌ఎస్ పార్టీకి, ప్రభుత్వ పనితీరుకు ప్రజల నుంచి విశే షంగా మద్దతు వస్తోందని ఇండియా టు డే సర్వే పేర్కొంది. సెప్టెంబర్‌కు నవంబర్‌కు మధ్య మూడు శాతం ప్రజల మద్దతు పెరిగింది టీఆర్‌ఎస్ అభ్యర్థులు, పార్టీ శ్రేణులు గడిచిన నాలు గున్నర సంవత్సరాలుగా చేపట్టిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలతో.. టీఆర్‌ఎస్‌పై ప్రజలు ఆకర్షితులవుతు న్నారని ఈ పెరిగిన మద్దతే నిదర్శనమని చెప్పవచ్చు. గత సెప్టెం బర్‌లో టీఆర్‌ఎస్‌పై, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ప్రజల్లో 43 శాతం మద్దతు ఉంటే.. నవంబర్ నాటికి అది 46 శాతానికి పెర గడం విశేషం. మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగా 75 శాతం ప్రజలు మళ్లీ టీఆర్‌ఎసే అధికారంలోకి వస్తుందని, ముఖ్య మంత్రిగా కేసీ ఆరే పగ్గాలు చేపట్టబోతున్నారని ఇండియా టుడే సర్వే కరాఖండిగా తేల్చేసింది.

130
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles