మృతుడి కుటుంబానికి ఎర్రబెల్లి పరామర్శ

Fri,November 9, 2018 02:52 AM

దేవరుప్పుల, నవంబర్ 08 : కడవెండిలో టీఆర్‌ఎస్ కార్యకర్త చెన్నూరు నర్సింగరావు తండ్రి వీరయ్య బుధవారం అనారోగ్యంతో మృతి చెందగా, ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే దయాకర్‌రావు ఆయన మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం వీరయ్య కుమారులు నర్సింగరావు, రాంబాబును పరామర్శించి ఆర్థికసాయం అందజేశారు. ఎర్రబెల్లి వెంట టీఆర్‌ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు పోతిరెడ్డి లీనారెడ్డి, మాజీ సర్పంచ్ హనుమంతు, టీఆర్‌ఎస్ యూత్ మండల ఉపాధ్యక్షుడు తాటిపెట్టి మహేశ్, గ్రామ కార్యదర్శి బాషిపాక భిక్షపతి, నాయకులు సత్యనారాయణ, గిరియాదవ్, సాయిలు, అంజయ్య కత్తుల సుధాకర్ ఉన్నారు.

ఉషా దయాకర్‌రావు పరామర్శ
పాలకుర్తి రూరల్ :మండలంలోని పలు గ్రామాల్లో అనారోగ్యంతో మృతి చెందిన బాధిత కుటుంబాలను పాలకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు సతీమణి, ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్టు చైర్ పర్సన్ ఎర్రబెల్లి ఉషాదయాకర్‌రావు గురువారం పరామర్శించారు. గోపాలపురంలో పులి వరమ్మ, ముత్తారంలో బండి అచ్చయ్య, భూమండ్ల అనిల్, గ్యార భిక్షం అనారోగ్యంతో మృతి చెందగా బాధిత కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. ఆమె వెంట నాయకులు కఠారి పాపారావు, బొమ్మగాని కొంరయ్య, భూమ రంగయ్య, భారత శ్రీరాములు, కర్ర రవీందర్, భూమ వెంకటయ్య, చింతకింది ఉపేందర్, సోమిరెడ్డి, వెంకట్‌రెడ్డి, వెన్నమనేని మురళీధర్‌రావు, బండి అయోధ్య ఉన్నారు.

130
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles