టీఆర్‌ఎస్‌లో చేరిన పజ్జూరి గోపయ్య


Fri,November 9, 2018 02:52 AM

జనగామ, నమస్తే తెలంగాణ, నవంబర్ 08 : జనగామ చాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవ అధ్యక్షుడు, ఫర్టిలైజర్స్ అండ్ ఫెస్టిసైడ్స్ జిల్లా అధ్యక్షుడు, ప్రముఖ వ్యాపారి పజ్జూరి గోప య్య గురువారం టీఆర్‌ఎస్‌లో చేరారు. జిల్లా కేంద్రంలోని బృందావన్ గార్డెన్‌లో మండలి విప్ బోడకుంటి హాజరైన జనగామ అర్బన్, రూరల్, బచ్చన్నపేట మండల పార్టీ బూత్ కమిటీల సమావేశంలో గోపయ్య పార్టీలో చేరగా జనగామ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా గోప య్య మాట్లాడుతూ రైతులు, వ్యాపారుల సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వ విధానాలు తనకు బాగా నచ్చాయని, రానున్న ఎన్నికల్లో రాష్ర్టాన్ని బంగారు తెలంగాణ దిశగా ముందుకు తీసుకుపోయే సత్తా కేవలం సీఎం కేసీఆర్‌కు మా త్రమే ఉందని నమ్మి పార్టీలోకి వచ్చానన్నారు. రైతులకు పెట్టుబడి సాయంతో అప్పుల బాధ నుంచి ఉపశమనం పొందుతున్నారని, రైతు బీమా సైతం మృతుల కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్నాయని చెప్పారు. సబ్బండ వర్గాలు, సకల కులాల సంక్షేమ సర్కారుగా టీఆర్‌ఎస్ నాలుగేళ్ల పాలన సాగిందని, రానున్న ఐదేళ్లలో మళ్లీ టీఆర్‌ఎస్ ప్రభుత్వం పరిపాలన వైపు దృష్టి సారించి దేశానికే ఆదర్శంగా నిలిచేలా అభివృద్ధి దిశగా ముందుకు తీసుకుపోతారనే నమ్మకం క్షేత్రస్థాయి ప్రజల్లో ఏర్పడిందన్నారు. ఆయన వెంట ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు పోకల లింగయ్య తదితరులు ఉన్నారు.

115
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...