వీఆర్‌వో రాత పరీక్షలు పకడ్భందీగా నిర్వహించాలి


Thu,September 13, 2018 12:43 AM

- జేసీ కె.స్వర్ణలత
మంజూర్‌నగర్, సెప్టెంబర్ 12 :
వీఆర్‌వో రిక్రూట్‌మెంట్ రాత పరీక్షలు పకడ్భందీగా నిర్వహించాలని జిల్లా సంయుక్త కలెక్టర్ కూరాకుల స్వర్ణలత అధికారులను ఆదేశించారు. బుధవారం సంయుక్త కలెక్టర్ కార్యాలయంలో పోలీసు శాఖ, విద్యుత్ శాఖ, ఆర్టీసీ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఈ నెల 16న ఉదయం 11గంటల నుండి మధ్యాహ్నం 1.30గంటల వరకు జిల్లాలోని 33 కేంద్రాల్లో నిర్వహించనున్న వీఆర్‌వో రాత పరీక్షలకు అన్ని రకాల మౌళిక సదుపాయాలను కల్పించాలని అన్నారు. పరీక్ష నిర్వహిస్తున్న కేంద్రాలలో నిరంతర విద్యుత్ సౌకర్యం కల్పించాలని, పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని, జిల్లా కేంద్రం నుండి కాటారం, రేగొండ, గోవిందరావుపేట(చల్వాయి), గణపురం, ములుగు, ఏటూరునాగారంలో జరుగు పరీక్ష కేంద్రాలకు బస్సు సౌకర్యాలు కల్పించాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. భూపాలపల్లిలో 15, కాటారంలో 1, రేగొండలో 2, గోవిందరావుపేట(చల్వాయి)లో 1, గణపురంలో 3, ములుగులో 8, ఏటూరునాగారంలో 3 పరీక్ష కేంద్రాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ రాజమహేంద్రనాయక్, ఆర్టీసీ అసిస్టెంట్ మేనేజర్ రవీంద్రనాధ్, విద్యుత్ శాఖ ఏడీ వెంకటేశం, కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారి మహేశ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

116
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...