మాజీ ఎమ్మెల్యే గండ్ర నుంచి ప్రాణ హానీ ఉంది!

Thu,September 13, 2018 12:42 AM

-చంపేస్తానని బెదిరించడంతో భయంగా బతుకున్నా
-తప్పుడు కేసు పెట్టించి జైలుకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు
-క్రషర్ కొనుగోలు చేసి రూ.2కోట్లు ఇవ్వాల్సి ఉన్నా కోర్టు నోటీసు పంపారు
-పొత్తుల క్రషర్ నుంచి బయటకు వచ్చినా నా భూమిలో రోడ్డు వేస్తున్నారు
-పోలీసులు రక్షణ కల్పించి తనకు న్యాయం జరిగేలా చూడాలి
-సమావేశంలో కంటతడి పెట్టిన క్రషర్ నిర్వాహకులు ఎర్రబెల్లి రవీందర్‌రావు
శాయంపేట, సెప్టెంబర్ 12 ః భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే, మాజీ చీఫ్‌విప్ గండ్ర వెంకటరమణారెడ్డి నుంచి తనకు ప్రాణ హానీ ఉందని క్రషర్ నిర్వాహకుడు ఎర్రబెల్లి రవీందర్‌రావు ఆరోపించారు. తనను చంపేస్తానని బెదిరించడంతో భయంతో బతుకుతున్నట్లు చెప్పారు. తన నుంచి కొనుగోలు చేసి క్రషర్‌కు, మిగతా మొత్తం రూ.5కోట్ల వరకు రావాల్సి ఉన్నా ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని తెలిపారు. తప్పుడు కేసు పెట్టి రాజకీయ పలుకుబడితో జైలుకు పంపించే ప్రయత్నం చేస్తున్నారని కంటతడి పెట్టుకున్నారు. పోలీసులు తనకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని వేడుకున్నారు. శాయంపేట గ్రామ పంచాయతీ ఆవరణలో బుధవారం ఎర్రబెల్లి రవీందర్‌రావు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ శాయంపేట మండలం గోవిందాపూర్ పరిధిలో ఒక క్రషర్, ఆత్మకూరు మండలం కొత్తగట్టులోను మరో క్రషర్ గండ్ర వెంకటరమణారెడ్డితో కలిసి మా ఇద్దరి భాగస్వామ్యంలో ఉన్నట్లు రవీందర్‌రావు చెప్పారు. ఇందులో గండ్ర సోదరుడు భూపాల్‌రెడ్డి కూడా భాగస్వామిగా ఉన్నారన్నారు. వాళ్లకు యాబైశాతం, తనకు శాతం వాటా ఉన్నట్లు చెప్పారు. 2007 నుంచి కలిసిమెలిసి వ్యాపారం చేసుకున్నట్లు తెలిపారు. ఈ మధ్య కాలంలో పొత్తు వద్దు ఎవరిది వారే వ్యాపారం చేసుకుందామని నిర్ణయించుకున్నామన్నారు.

దీంతో కొత్తగట్టులో ఉన్న శ్రీవెంకటేశ్వర క్రషర్‌ను వారి ఒత్తిడితో గత జనవరిలో తాను గండ్ర వెంకటరమణారెడ్డికి అమ్ముకున్నానన్నారు. దీని మొత్తం విలువ రూ.10కోట్లు ఉంటుందన్నారు. అయితే ఈ క్రషర్ తమకే కావాలని బలవంతంగా బయానా కాగితంపై సంతకం పెట్టించారన్నారు. మరో భాగస్వామి ధనుజంయ పిలిచి తమకు గొడవ వద్దని చెప్పడంతో అంగీకరించానన్నారు. దాంతో కోటి రూపాయలు అడ్వాన్స్ ఇచ్చాని మార్చి నెల లోపు మిగిలిన రూ.4కోట్లు ఇవ్వాల్సి ఉందన్నారు. కానీ కొత్తగట్టు క్రషర్‌లోకి వచ్చే హక్కు నీకు లేదని మా అధీనంలో ఉందని కోర్టులోనె రూ.4కోట్లు డిపాజిట్ చేస్తామని ఎదైనా ఉంటే కోర్టులో చూసుకుందామని లీగల్ నోటీసు పంపించారన్నారు. దాంతో గ్రామ పంచాయతీ సహకారం కోరి డబ్బులు ఇచ్చే వరకు తానే ఓనర్‌ను అని క్రషర్‌ను నడిపించవద్దని వర్కర్ల సహకారంతో క్రషర్‌ను బంద్ చేసినట్లు చెప్పారు. తదననంతరం న్యాయవాది మల్లారెడ్డితో మాట్లాడించానని దాంతో డబ్బులు ఇస్తామని చెప్పడంతో వెళ్ళిపోయినట్లు చెప్పారు. కానీ గండ్ర డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టారన్నారు. ఈ క్రమంలో గోవిందాపూర్ పరిధిలో యాబై ఎకరాల్లో ఇద్దరి భాగస్వామ్యంతో ఉన్న క్రషర్‌ను పంచుకుని గెట్లు పెట్టుకున్నామన్నారు.

అయితే గెట్లు పెట్టుకున్నా గెట్టు జరుపడం, బోరు వేయడం చేస్తుండటంతో ఎప్పటికప్పుడు చెబుతున్నా పట్టించుకోలేదని వాపోయారు. తాను తన వైపు క్రషర్ మిల్లు పెట్టుకున్న భూమిలో మధ్యలోంచి రోడ్డును వేస్తున్నారని దాంతో తనకు ఇబ్బంది కలుగుతుందని అలా చేయవద్దని వెంకటరమణారెడ్డి, భూపాల్‌రెడ్డిలకు దండంపెట్టి చెప్పినా మాట ఖాతరు చేయలేదన్నారు. పదిహేను రోజుల క్రితం తన భూమిలోని జామాయిల్ చెట్లను నరికివేశారన్నారు. దీంతో న్యాయవాది మల్లారెడ్డిని తీసుకెళ్లి చూపించడం జరిగిందన్నారు. బాట తీయడం సరికాదని చెప్పారన్నారు. గోవిందాపూర్ సర్పంచ్ భూమి భూమి పక్కనే ఉందని తాను డబ్బులు ఖర్చు అయినా ఒప్పించి రోడ్డు వేయిస్తానని చెప్పించినా వినలేదన్నారు. రెండు రోజుల క్రితం రాత్రి హిటాచీలు పెట్టి తన భూమిలో రోడ్డు వేస్తున్నట్లు తెలియడంతో వెళ్లానని ఇది పద్దతి కాదని ఆపించానన్నారు. మరుసటి రోజు శాయంపేట పోలీస్‌స్టేషన్‌లో తాను తుపాకీతో బెదిరించానని తప్పుడు కేసు పెట్టించారన్నారు.

రాజకీయ అండదండలతో ఎట్టి పరిస్థితుల్లో జైలుకు పంపాలని ఇబ్బందిపెట్టారన్నారు. నాకు లైసెన్సు తుపాకీ ఉందని, గండ్ర రమణారెడ్డి వాళ్లకు లైసెన్సు తుపాకీ ఉందని చెప్పారు. ఒక న్యాయవాదితో తనను చంపుతానని బెదిరించాడన్నారు. అయినా రమణారెడ్డి తనవాడు అని నవ్వుకుంటు మాట్లారని అనుకున్నట్లు కన్నీటి పర్యంతమయ్యారు. రవీందర్‌రావును చంపేస్తామని రమణారెడ్డి చెప్పాడని కాని ఎందుకలా చేస్తారని అన్నదమ్ములకు దండంపెట్టి కూడా చెప్పానన్నారు. అయినా తనను వదిలిపెట్టడం లేదని అన్నారు. తన సొంత ఆస్తీపై ఇబ్బంది పెడుతున్నారన్నారు. తన భూమిలోంచి రోడ్డు వేస్తుంటే తాను భయంతో వెళ్ళలేదని వెళితే కొట్టేవారన్నారు. అయితే పోలీసులు వెళ్ళి రోడ్డెయ్యవద్దని చెప్పి తిరిగి రాగానె మళ్ళీ రోడ్డు వేశారని చెప్పారు.

తనకు పోలీసులు రక్షణ కల్పించి, న్యాయం చేయాలని అన్నారు. కొత్తగట్టు క్రషర్‌కు సంబంధించి తనకు రూ.2కోట్లు రావాలని, గోవిందాపూర్‌లోని పొత్తుల క్రషర్‌కు సంబందించి రూ.3.50కోట్లు రావాల్సిన వసూళ్లలో ఎవరివి వారు తీసుకోవాల్సి ఉందన్నారు. పొత్తుల నుంచి విడిపోయి రమణారెడ్డి బాలాజీ రోబోసాండ్ క్రషర్‌ను, తాను ఈఆర్‌ఆర్ క్రషర్ ప్రారంభించుకున్నట్లు చెప్పారు. ఈ సందర్బంగా లీగల్‌నోటీసు, బయాన కాగితమును, పాస్‌బుక్, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను రవీందర్‌రావు చూపించారు. బయానా కాగితంలో ఎలా ఉంటే అలా తాను నడుచుకుంటానని స్పష్టంచేశారు. తనపై దౌర్జన్యంగా తన భూమిలో రోడ్డు వేస్తుంటే అపితే కేసులుపెట్టి ఇబ్బందులు పెడుతున్నట్లు చెప్పారు.తమ పంచాయతీ పరిష్కరించే వరకు తనకు పోలీసులురక్షణ కల్పించి న్యాయంచేయాలని కోరారు.

123
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles