మట్టి వినాయకులనే ప్రతిష్ఠించాలి

Thu,September 13, 2018 12:41 AM

పాఠశాలల్లో విగ్రహాల తయారీ
ప్రజలకు ఉచితంగా పంపిణీ
గ్రామాల్లో విద్యార్థులు,
ఉపాధ్యాయుల ర్యాలీలు
లింగాలఘనపురం/ బచ్చన్నపేట/ జనగామ రూరల్/ రఘునాథపల్లి / గుండాల సెప్టెంబర్ 12 : మండల కేంద్రాలతోపాటు గ్రామాల్లోని వాడవాడలా వినాయక మండళ్లు ముస్తాబవుతున్నాయి. ఆయా భక్త మండలి బాధ్యులు, యువజన సంఘాల నాయకులు గురువారం నుంచి వినాయక నవరాత్రోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు మండపాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలోనే.. పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయక విగ్రహాలనే ప్రతిష్ఠించాలని కోరుతూ పలు పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు ర్యాలీలు బుధవారం నిర్వహించారు. విద్యార్థులు తయారు చేసిన మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. బచ్చన్నపేట మండలంలోని రామచంద్రాపూర్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు తయారు చేసిన విగ్రహాలను గ్రామస్తులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు ప్రభాకర్, ఐల య్య, శ్యాంమోహన్ తదితరులు పాల్గొన్నారు.
జనగామ మండలంలోని సిద్దెంకిలో మం డల ప్రజాపరిషత్ ప్రాథమిక పాఠశాలలో మట్టి విగ్రహాలపై విద్యార్థులకు అవగాహన కల్పించి, పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు పర్శయ్య, ఉపాధ్యాయులు మమత, సహిన్, శ్రీదివ్య, జిగురు శ్రీను, మడిపల్లి లత, రాజు, తదితరులు పాల్గొన్నారు. రఘునాథపల్లి మండలంలోని ఖిలాషాపురం హైస్కూల్‌లో మట్టి విగ్రహాలను గ్రామస్తులకు పంపిణీ చేశారు. అనంతరం విద్యార్థులు మట్టి వినాయకులను పూజిద్దాం-నీటి కాలుష్యాన్ని నివారిద్దాం.. అంటూ గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం సత్యనారాయణ స్వామి, ఉపాధ్యాయులు రమేశ్, భగవాన్‌రెడ్డి, లింగమూర్తి, శ్రీనివాస్, పాండ్యా, అనిత, సీఆర్‌పీ శ్రీనివాస్, వందేమాతరం పౌడేషన్ ప్రతినిధి గుగ్గిళ్ల రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.

గుండాల మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు మట్టితో వినాయక విగ్రహాలను తయారు చేసి, పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు విష్ణువర్ధన్‌రెడ్డి, గిరివర్ధన్, రజిత, స్వప్న, వెంకట్‌రెడ్డి, శ్రీమాన్, రాజు పాల్గొన్నారు. కాగా, లింగాలఘనపురం మండలంలోని నెల్లుట్ల, కుందా రం చెరువుల్లో విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

105
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles