రాజన్న గెలుపునకు కృషి చేస్తా.. : ఎమ్మెల్సీ పల్లా

Thu,September 13, 2018 12:41 AM

స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా బరిలో నిలువనున్న తాజా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య గెలుపు కోసం అన్ని విధాల కృషి చేయడమే కాకుండా అన్ని తానై గెలిపిస్తానని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాజీ ఎమ్మెల్యేకు హమీ ఇచ్చినట్లు తెలిపారు. హైదరాబాద్‌లో పల్లా రాజేశ్వర్‌రెడ్డిని తన గృహంలో మాజీ ఎమ్మెల్యే రాజయ్య నియోజకవర్గ నాయకులతో కలిసి పుష్పగుచ్ఛం అందించి తన గెలుపునకు సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ ఎన్నికల సమయంలో నియోజకవర్గంలోనే ఉండి ఇంటింటా ప్రచారం నిర్వహిస్తానని తెలిపారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి సీఎం కేసీఆర్ తీసుకెళ్లి అమలు చేశారని గుర్తు చేశారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఫలాలను ఆయుధాలుగా మలుచుకుని ప్రచారాన్ని హోరెత్తించాలని రాజయ్యకు సూచించారు. తాజా మాజీ ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడుతూ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి సహకారంతో వచ్చే ఎన్నికల్లో అఖండ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొందుతానని అన్నారు.

ఇప్పటికే నియోజకవర్గంలో అభివృద్ధి చేశానని, ప్రజలు మరోసారి తనను అశీర్వదించాలని కోరారు. టీఆర్‌ఎస్ గెలుపుకోసం కార్యకర్తలు అవిశ్రాంతంగా పని చేయాలని, ప్రతీ కార్యకర్తను కాపాడుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కోమురవెల్లి దేవస్థానం చైర్మన్ సేవెల్లి సంపత్, జిల్లా నాయకులు చింతకుంట్ల నరేందర్‌రెడ్డి, సింగపురం జగన్, యాదగిరి, ఆకుల కుమార్, మారపాక రవి, రాజేశ్వర్‌రెడ్డి, గుజ్జరి రాజు, బుచ్చయ్య, కరంచంద్, పీఎసీఎస్ చైర్మన్లు రమేశ్, వీరన్న, నియోజకవర్గంలోని ఏడు మండలాల టీఆర్‌ఎస్ పార్టీ మండలాధ్యక్షులు రంజిత్‌రెడ్డి, సారంగపాణి, నాగేందర్, దేవేందర్, రాంగోపాల్‌రెడ్డి, కనకయ్య, శివకుమార్, నాయకులు బాలరాజు, సురేశ్, బాలరాజు, శ్రీనివాస్, రంగు రమేశ్‌గౌడ్, వెంకటేశ్వర్లు, నాగరాజుగౌడ్, పెద్ది రెడ్డి, శంకర్, సమ్మిరెడ్డి, మనోహర్‌రెడ్డి, రమేశ్‌నాయక్, గణేశ్ తదితరులు పాల్గొన్నారు.

137
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles