రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలి : కడియం


Thu,September 13, 2018 12:40 AM

చిలుపూరు, సెప్టెంబర్ 12 : రానున్న శాసన సభ ఎన్నికల్లో రెట్టింపు ఉత్సాహంతో కార్యకర్తలు పనిచేయాలని, రాజయ్యను గెలిపించేందుకు కృషి చేయాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పిలుపునిచ్చారు. తన గెలుపునకు సహకరించాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరిని తాజా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య కోరారు. బుధవారం హైదరాబాద్‌లో కడియంను కలిసి పాదాభివందనం చేసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా కాసేపు ఎన్నికల ప్రచారంపై కడియం రాజయ్యకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ స్టేషన్‌ఘన్‌పూర్‌లో టీఆర్‌ఎస్ గెలుపుకోసం ప్రతీ కార్యకర్త రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలని సూచించినట్లు చెప్పారు. గ్రామాల వారీగా ప్రచారాన్ని ముమ్మరం చేయాలని, కార్యకర్తలు గ్రామల్లోనే ఉండి ఇతర పార్టీల నాయకుల కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ముందుకెళ్లాలని సూచించారని తెలిపారు. త్వరలోనే నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. వర్గాలకు తావు లేకుండా నాయకులందరినీ సమన్వయం చేయాల్సిన అవసరం ఉందని సూచించినట్లు చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి పథకాలే టీఆర్‌ఎస్ గెలుపునకు శ్రీరామరక్షగా నిలుస్తాయని వివరించినట్లు తెలిపారు. బూత్‌ల వారీగా చురుకైన కార్యకర్తలను ఎంపిక చేసి ప్రజా క్షేత్రంలోకి వెళ్లాలని పిలుపునిచినట్లు తెలిపారు.

105
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles

మరిన్ని వార్తలు...