ముత్తిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి


Thu,September 13, 2018 12:39 AM

నర్మెట, సెప్టెంబర్ 12 : తాజా మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని భారీ మెజారీటితో గెలుపించుకునేందుకు గ్రామాల్లోని కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని టీఆర్‌ఎస్ యూత్ మండల అధ్యక్షుడు పార్నంది అక్ష్మీనారాయణశర్మ, టీఆర్‌ఎస్ నర్మెట గ్రామ అధ్యక్షుడు అమెడపు కమలాకర్‌రెడ్డి అన్నారు. మండలకేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో మరోసారి గులాబీ ప్రభంజనం సృష్టిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీలు ఎన్ని కుట్రలు చేసినా ముత్తిరెడ్డిని లఓ ఓట్ల మెజార్టీతో గెలుస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు. జనగామ అభివృద్ధి ప్రదాత, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని అఖండ విజయంతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్వీ మండల అధ్యక్షుడు గడపురం శశిరథ్, జాగృతి మండల అధ్యక్షుడు కున్‌సావత్ జయరాంనాయక్, గుగులోత్ కృష్ణ, కొర్ర రమేశ్, గుగులోత్ రవి, లాలు, మాలోత్ రాజ్‌కుమార్, కొలేపాక అరవింద్, కార్యకర్తలు పాల్గొన్నారు.

91
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...