అకింత భావంతో పని చేస్తేనే గుర్తింపు


Thu,September 13, 2018 12:39 AM

రఘునాథపల్లి, సెప్టెంబర్ 12 : ప్రతీ ఉద్యోగి అంకితభావంతో పనిచేస్తేనే గుర్తింపు ఉంటుందని, అలాగే ప్రతీ ఉద్యోగి బదిలీ తప్పదని ఖిలాషాపురం పాఠశాల హెచ్‌ఎం డీ సత్యనారాయణ స్వామి అన్నారు. ఖిలాషాపురం హైస్కూల్‌లో బుధవారం బదిలీపై వెళ్లిన ఎనిమిది మంది ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వం పాఠశాలల అభివృద్ధికి నిధులు కేటాయిస్తూ పాఠశాలలో ప్రైవేటుకు ధీటుగా మౌలిక సదుపాయాలు కల్పిస్తోందని చెప్పారు. అంతకు ముందు పాఠశాల నుంచి బదిలీపై వెళ్తున్న పలువురి ఉపాధ్యాయులను వందే మాతరం ఫౌండేషన్ ప్రతినిధి గుగ్గిళ్ల రవికుమార్‌ను పూలమాల, శాలువాతో సత్కరించారు. సన్మానం పొందిన వారిలో మెహినీబాయి, ప్రవీణ్‌కుమార్, వెంకటస్వామి, అరుణ, విజయలక్ష్మి, జాస్వీన్, ఎస్‌ఎస్‌వీఎం శర్మ, లక్ష్మి, తదితరులు ఉన్నారు.

86
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...