ఉత్తమ విద్యార్థులకు నగదు పురస్కారాలు అందజేత


Thu,September 13, 2018 12:39 AM

దేవరుప్పుల, సెప్టెంబర్ 12 : కోలుకొండ ఉన్నత పాఠశాలలో గత సంవత్సరం పదో తరగతిలో అత్యధిక జీపీఏ సాధించిన విద్యార్థులకు పలువురు దాతలు నగదు పురస్కారాలు అందజేశారు. పాఠశాలలో బుధవారం హెచ్‌ఎం వనమా ల రమేశ్ అధ్యతన ప్రత్యేక క్యాక్రమాన్ని నిర్వహించారు. పదో తరగతి వార్షిక పరీక్ష ఫలితాల్లో ప్రథ మ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన గుగులోత్ శ్రీకాం త్, ఇనుముల అఖిలక కోలుకొండ శివారు పల్లె రాంచంద్రాపురానికి చెందిన ప్రొఫెసర్ కొండాజీ రూ.3 వేలు, 2 వేలు అందించారు. ఇక బాసర ఐఐటీకి ఎంపికైన గుగులోతు శ్రీకాంత్‌కు హైదరాబాద్ చైతన్యపురికి చెందిన సాప్ట్‌వేర్ ఇంజినీర్ ఐత సునీల్ రూ.2వేలు అందజేశారు. అలాగే వి ద్యార్థులను ప్రోత్సహించే ప్రయత్నంగా హెచ్ ఎం రమేశ్ వీరిద్దరికి రూ.500 చొప్పున అందించారు. గ్రామ ప్రత్యేకాధికారి పరిశోదన్, ఎస్సెంసీ చైర్మన్ యాకస్వామి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

91
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles

మరిన్ని వార్తలు...