పాడి రైతు మురిసేలా..

Wed,September 12, 2018 03:22 AM

దేవరుప్పుల, సెప్టెంబర్ 11 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన సబ్సిడీ బర్రెల పంపిణీ పథకంతో పాడి రైతులకు మేలు జరుగుతోంది. దేవరుప్పుల మండలం జిల్లాలోనే అత్యధిక పాలు ఉత్పత్తి చేసే మండలంగా పేరుంది. ఒక్క పెదమడూరు గ్రామం నుంచే 1200 లీటర్ల పాలు ప్రతి రోజూ ఉదయం పాలకేంద్రంలో పోస్తుంటారు. ఈ నేపథ్యంలో పాల ఉత్పత్తిని మరింత పెంచేందుకు ప్రభుత్వం దేవరుప్పుల మండలానికి 1082 యూనిట్ల గేదెలను మంజూరు చేసింది. ఇందులో భాగంగా మండలం లోని సింగరాజుపల్లిలో పశుసంవర్ధకశాఖ, విజయడైరీ సంయుక్తంగా రైతులకు బర్రెల పంపిణీ చేపట్టారు. ఆగస్టు 25న రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఈ పథకాన్ని ప్రారంభించారు. ఎస్సీ,ఎస్టీలకు 80 శాతం, ఇతరులకు 50 శాతం సబ్సిడీపై గేదెలను అందజేశారు. దేవరుప్పుల మండలంలో ఇప్పటికే 468 యూనిట్లు పంపిణీ చచేశారు. ఆంధ్రాలోని ఉయ్యూరు, కంకిపాడు నుంచి ప్రభుత్వం గేదెలను కొనుగోలు చేసి రైతులకు పంపిణీ చేస్తోంది. అంతేకాకుండా వారు ఇబ్బంది పడకుండా వారికి పచ్చిమేత, దాణా, అవసరమైన మందులు రాయితీపై ప్రభుత్వం అందిస్తుంది. ప్రతీ పశువుకు ఇన్సూరెన్స్ చేయించి అనారోగ్యంతో మరణించినా, ప్రమాదవశాత్తు మరణించినా వెంటనే మరో పాడిగేదెను అందజేసేలా అధికారులు కృషి చేస్తున్నారు.

137
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles