టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే మత్స్యకారులకు మంచి రోజులు


Wed,September 12, 2018 03:22 AM

చిలుపూరు, సెప్టెంబర్ 11: టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే మత్స్యకారులకు మంచి రోజులు వచ్చాయని మత్స్య సహకార సంఘం జిల్లా డైరెక్టర్ నీల రాజు అన్నారు. మంగళవారం మండలంలోని రాజవరం, చిలుపూరు, కృష్ణాజీగూడెం, పల్లగుట్ట, మల్కాపూర్, ఫత్తేపూర్, నష్కల్ గ్రామాలలోని చెరవుల్లో చేప పిల్లలను వేయడానికి గాను మత్స్యశాఖ జిల్లా అధికారి పల్లి శ్రీపతి ఆధ్వర్యంలో మత్స్యకారులకు చేప పిల్లలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మత్స్యకార్మికులకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం చేపపిల్లలు పంపిణి చేస్తుందన్నారు. మండలంలోని వివిధ గ్రామాలకు 8.64 లక్షల చేప పిల్లలు పంపిణి చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో కుమారస్వామి, ఫీల్డ్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, జంగిటి కుమార్, వీరయ్య, ఊరడి శ్రీనివాస్, నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు.

94
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...