నల్లధనం వెలికితీతలో కేంద్రం విఫలం

Wed,September 12, 2018 03:21 AM

జనగామ టౌన్, సెప్టెంబర్ 11: నల్లధనం వెలికితీతలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని టీ కాంగ్రెస్ మాజీ పీసీపీ పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని పలు వార్డుల్లో కాంగ్రెస్ జెండా పండుగను మంగళవారం నిర్వహించారు. జయశంకర్‌నగర్‌లో విలేకరులతో మాట్లాడారు. ప్రధాని మోడీ అధికారంలోకి వచ్చాక విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని 6 నెలల్లో వెలికి తీస్తామని, నల్లధనం పేరిట పెద్దనోట్లను రద్దు చేసి సామాన్యులపై మోయలేని భారాన్ని ఎత్తారన్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జి శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అన్వర్, బుచ్చిరెడ్డి, నాయకులు ప్రవీణ్‌కుమార్, శ్రీనివాస్, కర్ణాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

99
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles