బీరప్ప ఆశీస్సులతో ముత్తిరెడ్డి ఎన్నికల ప్రచారం

Wed,September 12, 2018 03:21 AM

జనగామ టౌన్, సెప్టెంబర్ 11 : ప్రజా సంక్షేమం కోసం పోరాడే ఏకైక పార్టీ, ప్రజల మనసులో ఉన్న పార్టీ టీఆర్‌ఎస్ పార్టీ మాత్రమేనని తాజా మాజీ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ అసెంబ్లీ జనగామ అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరెడ్డి అన్నారు. మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్ నాయకులు జిల్లా కేంద్రంలోని బీరప్ప ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముత్తిరెడ్డి మాట్లాడుతూ గొల్ల కురుమల దైవం బీరప్ప ఆశిస్సులతో ఒగ్గుడోలుతో జిల్లా కేంద్రంలోని బీరప్ప ఆలయంలో రెండో రోజు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. వచ్చే ఎన్నికలలో టీఆర్‌ఎస్ పార్టీకే ప్రజలు ఓటేసి సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వాదించాలని కోరారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాకే జనగామ అభివృద్ధికి నోచుకుందని అన్నారు. అలాగే రాష్ట్రప్రభుత్వం భాషాసాంసృతిక శాఖ ఆధ్వర్యంలో జనగామలో ఈనెల 5 నుండి నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులను ఆయన సందర్శించి ఇతర రాష్ర్టాల నుంచి శిక్షణలకు వచ్చిన యువతను అభినందిస్తూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినంకా అన్నిరంగాల వారికి సమతుల్యమైన న్యాయం జరుగుతుందని, ఒకప్పుడు ఒగ్గుడోలు అంటే జనగామకు ఎంతో ప్రముఖ్యత ఉండేదని ఆ ఒగ్గుడోలుకు సీఎం కేసీఆర్ పూర్వ వైభవాన్ని తెచ్చేందుకే ఆయశాఖల ద్వారా ఈ శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తుందన్నారు. అనంతరం బీరప్ప ఆలయానికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డిని ఒగ్గు బీర్ల కళాకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఒగ్గు రవి బృందం ఆధ్వర్యంలో శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో జనగామ వ్యవసాయ మార్కెట్ చైర్‌పర్సన్ బండ పద్మ, టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు బండ యాదగిరిరెడ్డి, మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షుడు బాల్దె సిద్దిలింగం, డాక్టర్ సుగుణాకర్‌రాజు, ఎంపీపీ యాదగిరిగౌడ్, గుంటి ఐలయ్య, జంగిడి సిద్దులు, జాయ సత్తయ్య, ఎం అశోక్, ఉపేందర్, శ్రీకాంత్, కరుణాకర్, మల్లేశ్, జే సిద్దులు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన కళాకారులు, తదితరులు పాల్గొన్నారు.

170
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles