పార్టీ గెలుపు కోసం ఐక్యంగా పనిచేయాలి

Wed,September 12, 2018 03:21 AM

తరిగొప్పుల, సెప్టెంబర్11: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపుకోసం ఐక్యంగా పని చేయా లని కార్యకర్తలకు తాజా మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. మండలకేంద్రంలో ఆ పార్టీ మండలశాఖ అధ్యక్షుడు పింగిళిజగన్‌మోహన్‌రెడ్డి, నర్మెట, తరిగొప్పుల ఉమ్మడి మండలాల ఎంపీపీ నూకల కృష్ణమూర్తి ఆధ్వర్యంలో పార్టీ ముఖ్యనాయకుల కార్యకర్తల సమన్వయ సమవేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ అదేశాలమెరకు ఈనెల 25లోపు యువ ఒటర్లను నమోదుచేయించాలని కోరారు. అదేవిధంగా ఓటర్లజాబితాలో తప్పు ఒప్పులను సరిదిద్దాలని దీనిలో గ్రామాల్లోని నాయకులు కార్యకర్తలు పాల్గొనాలని కోరారు. అదేవిధంగా బూత్‌లెవల్‌లో ఐదుగురుని నియమించుకోవాలని సూచించారు. పదవీకాలంలో చేసిన పనులు,ప్రభుత్వ సంక్షేమ పథకాలే మళ్లి గెలిపిస్తాయని ఎవరూ అధైర్యపడొద్దని చెప్పారు. పార్టీలో స్వార్థం లేకుండా పనిచేయాలని సూచించారు. పార్టీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితులను గమనించాలని సూచించారు. అప్రమత్తంగా ఉండాలని, లేకుంటే ప్రత్యర్థులు ఇబ్బందులకు గురి చేసే అవకాశాలున్నాయన్నారు. గతంలో జరిగిన ఎన్నికల్లో పొన్నాల, కొమ్మూరి ప్రతాప్‌రెడ్డిల ఓట్ల కౌంటింగ్ ప్రక్రియను గుర్తు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, టీడీపీలకు చెంది 20 మంది టీఆర్‌ఎస్‌లో చేరగా వారికి పార్టీ కండువా కప్పారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయసమితి మండల కోఆర్డినేటర్ జుమ్‌లాల్, ముద్దసానివెంకట్‌రెడ్డి, అధికార ప్రతినిధి చిలువేరులింగం, అర్జుసుధాకర్‌రెడ్డి, ఎంపీటీసీసభ్యులు కిష్టయ్య, తాళ్లపల్లి రాజేశ్వర్, తాళ్లపల్లి పోశయ్య , సంపత్, మహిపాల్, ప్రభుదాస్,కర్రెమల్లయ్య, పోగాకులరవి, టీఆర్‌ఎస్వీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

114
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles