త్వరలో ఎంపీడీవోలకు పదోన్నతులు

Wed,September 12, 2018 03:21 AM

సుబేదారి,సెప్టెంబర్ 11: ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న ఎంపీడీవోల పదోన్నతికి లైన్ క్లియర్ అయింది. మండల వ్యవస్థ ఏర్పడినప్ప టి నుంచి పంచాయతీరాజ్‌శాఖలో పనిచేస్తున్న మండలపరిషత్ అభివృద్ధి అధికారులకు పదోన్నతలు లేకుండాపోయాయి. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం 20 సంవత్సరాల నుంచి ఎంపీడీవోలు పదోన్నతులకు నోచుకోకుండా ఆదే హోదాలో పనిచేస్తున్నారు. గతపాలకుల నిర్ణక్ష్యం, పట్టింపులేకపోవడం వలనే వీరికి ప్రమోషన్లు లేకుండాపోయాయి అనే ఆరోపణ లున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత గ్రామాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న ఎంపీడీవోల సేవలను గుర్తిస్తూ వారు అడగకుండానే సీఎం కేసీఆర్ పదోన్నతులు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు ఇటీవలే అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా, పదోన్నతులకు సంబంధించిన పైల్‌పై కూడా సీఎం కేసీఆర్ సంతకం చేశారు. దీంతో, ఎంపీడీవోలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సీనియార్టీలో ఇబ్బందులను తొలగిస్తూ ఎలాంటి అడ్డంకులు లేకుండా, మార్గదర్శకాల ప్రకాం పదోన్నతి కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం 35జీవోను జారిచేసింది. దీనిపై కొందరు కోర్టును ఆశ్రహించినప్పటికి ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈ అంశాలపై మరోమారు సీఎం కేసీఆర్ సమీక్షచేసి, రాష్ట్రంలో అర్హత ఉన్న 130 మందికి పదోన్నతులు కల్పించడానికి సీఎం అధికారింగా తుది నిర్ణయం తీసుకొని పైల్‌పై సంతకం చేయడంతో లైన్‌క్ల్లియర్ అయింది. త్వరలోనే వీరందరు పదోన్నతి పొందనున్నారు. వారం, పది రోజుల్లో ఉమ్మడి వరంగల్ నుంచి ఎంత మందికి పదోన్నతులు పొందుతారనేది తేలనున్నది.

ఆరు విభాగాల్లో పదోన్నతులు
ఎంపిడీవోలకు రాష్ట్ర ప్రభుత్వం ఆరు విభాగాల్లో పదోన్నతులు కల్పించనున్నది. పంచాతీరాజ్,గ్రామీణాభివృద్ద్ధిశాఖలో జడ్పి డిప్యూటీ సీఈవో, డీఆర్‌డీవో, పంచాతీరాజ్, గ్రామీణావృ ద్ధి కమిషనర్, పైనాన్స్ కమిషనర్, ఈజీఎం అదనపు ప్రాజెక్టు డైరెక్టర్, అడిషనల్ ప్రాజెక్టుడైరెక్టర్ వంటి పోస్టులకు అర్హత లభిస్తుంది.

101
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles