దేవరుప్పు ల, సెప్టెంబర్ 11: దేవరుప్పుల మండలం మన్పహడ్ గ్రామంలో సోమవారం రాత్రి పిడుగుపాటుకు గ్రామంలోని జోగు యాదమ్మకు చెందిన గేదె మృతి చెందింది. యాదమ్మ ఇంటి పక్కనే చెట్టుకు గేదె కట్టేసి ఉండగా చెట్టుపై పిడుగుపడింది. దీంతో గేదె మృతి చెందింది. గేదె విలువ రూ. 50 వేలు ఉంటుందని స్థానికులు తెలిపారు. నిరుపేద వర్గానికి చెందిన యాదమ్మ కుటుంబానికి ప్రభుత్వం స్పందించి పరిహారం చెల్లించాలని గ్రామస్తులు కోరారు.
విద్యుత్ షాక్తో పొట్టేలు..
దేవరు ప్పు ల మండలం చింతబాయి తండా సమీఫంతో ఎల్టీ లైన్ తెగి పడడంతో, అక్కడ మేస్తున్న పొట్టేలు షాక్ తగిలి మృతి చెందింది. చింతబాయి తండా నుంచి దుర్గమ్మ గుడికి వెళ్లే విద్యుత్ లైన్ తెగిపడి ఉండగా తండాకు చెందిన కున్సోతు యాదానాయక్కు చెందిన గొర్రెల మంద అక్కడ మేస్తుంది. తెగిన వైరుకు విద్యుత్ ఉండడంతో అటుగా వెళ్లి మేస్తున్న పొట్టేలు విద్యుదాఘాతంతో అక్కడిక్కడే మృతి చెందింది. కాగా, అధికారులు స్పందించి నష్టపరిహాం అందించాలని బాధితుడు యాదానాయక్ కోరారు.