జనగామ టౌన్, సెప్టెంబర్ 11: పురుగుల మందు కలిపిన బియ్యం తిని ఓ యువకుడు మృతి చెందిన సంఘటన జనగామలో జరిగింది. టౌన్ ఎస్సై పరమేశ్వర్ కథనం ప్రకారం పట్టణానికి చెందిన ఎండీ ఇంతియాజ్ (22) కుర్మవాడలోని ఓ వెల్డింగ్ దుకాణంలో పని చేస్తున్నాడు. కాగా, దుకాణంలోకి వస్తున్న పందికొక్కులను చంపేందుకుగా ను యజమాని లింగం సోమవారం ఉదయం బి య్యంలో పురుగుల మందును కలిపి పెట్టాడు. ఈవిషయం తెలియని ఇంతియాజ్ బియ్యం తిని అస్వస్థతకు గురికాగా యజమాని గమనించి ఇంతియాజ్‌ను ఎంజీఎంకు తరలించగా అక్కడ చికిత్స పొం దుతూ అదే రోజు రాత్రి మృతి చెందాడు. మృతుడి తల్లి నజీయబేగం ఫిర్యాదు మేరకు లింగంపై మం గళవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.