పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ


Tue,September 11, 2018 02:14 AM

పాలకుర్తి, సెప్టెంబర్ 10: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి దారి చూపి, సామాజిక ఆధునిక పరిణామానికి నాంది పలికిన వీరవనిత చాకలి ఐలమ్మ అలియాస్ చిట్యాల ఐలమ్మ అని పాలకుర్తి తాజా మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. సోమవారం మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ(చిట్యాల) 33వ వర్థంతిని పురస్కరించుకొని మండల కేంద్రంలోని ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్వరాష్ట్రంలోనే ఐలమ్మకు తగిన గుర్తింపు లభించిందన్నారు. పోరాట యోధులకు తగు ప్రాధాన్యత కల్పించిన ఘనత సీఎం కేసీఆర్ సారధ్యంలోని తెలంగాణ ప్రభుత్వానికి దక్కిందన్నారు .హైదారాబాద్‌లో ట్యాంక్ బండ్ పై వీర వనీత ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా తక్షణమే స్పందించారన్నారు. భూమి, భుక్తి, పేద ప్రజల, విముక్తి కోసం విరోచిత పోరాటం చేసిన వీర నారి ఐలమ్మ అని కొనియాడారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మండ ల అధ్యక్షుడు నల్లా నాగిరెడ్డి, పాలకుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ ముస్కు రాంబాబు, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ వీరమనేని యాకాంతరావు, వైస్ ఎంపీపీ గూడ దామోదర్‌గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి సింగారపు దీపక్, ఎంపీటీసీ కత్తి సైదులు గౌడ్, పులి ఎలేంద్ర ,రాయపర్తి కొమురయ్య, కమ్మగాని రమేష్‌గౌడ్, లావుడ్యా రవి, చిట్యాల యాకయ్య, చిట్యాల సంధ్య, యుగేందర్ యాదవ్, నాయకులు పాల్గొన్నారు.

91
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...