గ్రామాల్లో సమన్వయంతో పని చేయాలి

Tue,September 11, 2018 02:14 AM

పాలకుర్తి రూరల్ సెప్టెంబర్ 10: నియోజక వర్గంలో టీఆర్‌ఎస్ జెండా ఎగరేలా కార్యకర్తలు నాయకులు సమన్వయంతో అహర్నిశలు శ్రమించాలని తాజా మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. స్థానిక పార్టీ కార్యాలంయలో సోమవారం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ గ్రామాల్లో మంజూరు చేసిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల మండలాలకు అదనంగా 500డబుల్ బెడ్‌రూం ఇళ్లను, నియోజక వర్గానికి 1600ఇళ్లను మంజూరు చేయించినట్లు తెలిపారు. రూ.20 కోట్లతో గిరిజన తండాలకు ఆవాస ప్రాంతాలకు బీటీ రోడ్లు మంజూరు చేసినట్లు చెప్పారు. గతంలో రూ.15కోట్లతో తండాలకు ఆవాస ప్రాంతాలకు బీటీ రోడ్లు వేయించామన్నారు. సీడీఎఫ్, ఎస్‌డీఎఫ్ నిధుల్లో మంజూరు చేసిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కార్యకర్తలను నాయకులను ఆదేశించారు. అభివృద్ధి పనులతోనే ప్రజల్లో గుర్తింపు లభిస్తోందని, ప్రభుత్వ పథకాలే శ్రీరామ రక్ష అని అన్నారు. ప్రతీ ఇంటికి సంక్షేమ ఫలాలు అందాయన్నారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులు నియోజక వర్గ ప్రజల అండదండలతో తాను 50వేల మెజారిటీతో గెలుపొందుతానన్నారు. ప్రతిపక్షాలకు డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయమన్నారు. తన 35ఏళ్ల రాజకీయ జీవితంలో మచ్చలేని వ్యక్తిగా కోనసాగనని, దయన్న అంటే ప్రజల మనిషి అని అన్నారు. ప్రజలకు సేవ చేసే బాధ్యతను అప్పగించాలని కోరారు. సీఎం కేసీఆర్‌తోపాటు తన కోసం కార్యకర్తలు నాయకులు కష్టపడాలన్నారు. ఈ సమావేశంలో ఎర్రబెల్లిచారిటబుల్ ట్రస్టు చైర్‌పర్సన్ ఎర్రబెల్లి ఉషాదయాకర్‌రావు, వరంగల్ వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ తనారాయణరావు, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు నాగిరెడ్డి, ప్రధాన కార్యదర్శి సింగారపు దీపక్, పాలకుర్తి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రాంబాబు, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు యాకాంతారావు, వైఎస్ ఎంపీపీ దామోదర్, ఎఫ్‌ఎస్‌సీఎస్ బ్యాంక్ చైర్మన్ మాధవరావు, సైదులు, శ్రీనివాసరావు, నవీన్, సతీశ్, ఏలేంద్ర పాల్గొన్నారు.

పార్టీ పటిష్టతకు కృషి చేయాలి
దేవరుప్పుల : ఎన్నికలు సమీపిస్తున్నందున ఎవరి స్థాయిలో వారు పార్టీ పటిష్టతకు కృషి చేయాలని తాజా మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మండల కేంద్రంలో రైతు సమన్వయ సమితి మండల కోర్డినేటర్ ఈదునూరి నర్సింహరెడ్డి నివాసంలో ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించారు. పార్టీలో అసంతృప్తికి తావులేకుండా చూడాలని, పెండింగ్ పనులను పూర్తి చేయాలని సూచించారు. గ్రామంలో ఓటుహక్కు లేని వారిని గుర్తించి వెంటనే నమోదు చేయించే బాధ్యతను కార్యకర్తలు తీసుకోవాలన్నారు. మండల స్ధాయి కమిటీ, గ్రామ స్థాయి కమిటీలు ఏర్పాటుచేసి ప్రతి రోజూ పార్టీ ప్రగతిపై సమీక్ష నిర్వహంచాలని సూచించారు. అభి వృద్ధికి రూ. 20 కోట్ల నిధులు మంజూరైనట్లు చెప్పారు.

సీఎంఆర్‌ఎఫ్ చెక్కు పంపిణీ
కామారెడ్డిగూడెంనకు చెందిన చింత భిక్షపతి అనారోగ్యంతో ప్రైవేటు దవఖానలో చికిత్స పొందగా అతనికి సీఎం సహాయనిధి నుంచి వచ్చిన రూ.60 వేల చెక్కును బాధితుడి భార్య స్వరూపకు ఎర్రబెల్లి అందజేశాడు. రెడ్డి సంక్షేమ సంఘం భవన నిర్మాణానికి నిధులు సమకూర్చినందకు దయాకర్‌రావును సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాంనర్స య్య, ఆంజనేయులు, గడ్డం రాజు, మల్లేశ్, జలేందర్‌రెడ్డి, సోమయ్య, దయాకర్,సోమనర్సయ్య, సాయి లు, కృష్ణమూర్తి, యాదగిరి, చింత రవి, తిరుమలేష్, దయాకర్‌రెడ్డి, వెంకటేశ్, అబ్బసాయిలు, కొండయ్య, యాదవరెడ్డి, మల్లయ్య, నర్సింహస్వామి, వీరారెడ్డి, నర్సింహరెడ్డి, అశోక్‌రెడ్డి, ఉప్పల్‌రెడ్డి, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

106
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles