అన్ని వర్గాలకూ సంక్షేమ ఫలాలు


Tue,September 11, 2018 02:14 AM

లింగాలఘనపురం, సెప్టెంబరు 10 : నాలుగున్నరేళ్ల పాలనలో ఎక్కడాలేని విధంగా అద్భుతమైన పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సీఎం కేసీఆర్ నేడు ప్రపంచానికే దిక్సూచిగా మారాడని స్టేషన్‌ఘన్‌పూర్ తాజా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. మండలకేంద్రంలో చాకలి ఐలమ్మ విగ్రహానికి ఆయన సోమవారం పూలమాల వేసి, కోలాటలాడుతూ ర్యాలీగా వెళ్లి తెలంగాణతల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు బొల్లంపెల్లి నాగేందర్ అధ్యక్షతన జరిగిన మండలస్ధాయి కార్యకర్తల సమావేశంలో రాజయ్య మాట్లాడారు. రైతుల కష్టాలెరిగిన నేతగా 24 గంటల విద్యుత్‌ను రైతాంగానికి అందించారన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా ఎకరానికి రూ.8వేల పెట్టుబడిని రైతులకందిస్తూ రైతు బాంధవుడిగా సీఎం కేసీఆర్ నిలిచాడన్నారు. గత ప్రభుత్వాల హయాంలో రైతులు ఎరువులు, విత్తనాల కోసం అష్టకష్టాలు పడేవారని, నేడు ఆ పరిస్థితి లేదని అన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణం కోసం సీఎం అహర్నిశలు కృషి చేస్తున్నారని, ఇంకా కొన్ని సాధించాల్సి ఉందన్నారు. ప్రతీ కార్యకర్తను తాను కంటికి రెప్పలా కాపాడుకుంటానన్నారు. కార్యకర్తల, అభిమానుల, శ్రేయోభిలాశుల దీవెనలతో రాబోయే ఎన్నికల్లో నియోజక వర్గంలో లక్ష మెజారిటీతో గెలుస్తానని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో కొమురవెల్లి దేవస్థాన చైర్మన్ సేవెల్లి సంపత్, రైతుసమన్వయసమితి జిల్లా సభ్యులు వంచ మనోహర్‌రెడ్డి, మండల కో ఆర్డినేటర్ బస్వగాని శ్రీనివాస్‌గౌడ్, నాయకులు చిట్ల ఉపేందర్‌రెడ్డి, రవీందర్‌రావు, గణపతి, డైరెక్టర్లు భాస్కర్‌రెడ్డి, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

81
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...