సమరానికి సై


Mon,September 10, 2018 03:52 AM

-జిల్లాలో ముందస్తు ఎన్నికల సందడి
-ఊపందుకోనున్న ప్రచార పర్వం
-ఇప్పటికే ప్రజల్లోకి ఎర్రబెల్లి, తాటికొండ
-నేడు జిల్లాకు రానున్న ముత్తిరెడ్డి
-పెంబర్తి వద్ద స్వాగతంపలుకనున్న శ్రేణులు
-ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతున్న యంత్రాంగం
-పొన్నాలపై సీనియర్ల తిరుగుబాటు
-టికెట్ కోసం టీపీసీసీ చీఫ్ వద్దకు నేతలు
జనగామ, నమస్తే తెలంగాణ, సెప్టెంబర్ 09 : రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో జిల్లాలో టీఆర్‌ఎస్ అభ్యర్థులు సమరానికి స న్నద్ధం అవుతున్నారు. హుస్నాబాద్ ప్రజా ఆశీర్వాద సభ విజయవంతం కావడంతో గులాబీ శ్రేణులు నూతనోత్సాహం నెలకొంది. గులాబీ అధినేత కేసీఆర్ అభ్యర్థిత్వాలను ప్రకటించిన తర్వాత ఇప్పటికే జిల్లాకు చెందిన పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్ టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, డాక్ట ర్ తాటికొండ రాజయ్య తమ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టారు. జనగామ అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సోమవారం (నేడు) జిల్లా కేంద్రంలోని యశ్వంతాపూర్ ఎల్లమ్మకు నైవేద్యం సమర్పించి తొలి మొక్కుతో నియోజకవర్గ ప్రజాశీర్వాదానికి బయలుదేరనున్నారు. జనగామ జిల్లా అంతటా గులాబీ క్యాడర్ ఫుల్ జోష్ తో కళకళలాడుతోంది. ముందస్తు ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిన పార్టీ నాయకులు, కార్యకర్తలు తమ నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రణాళికల్లో నిమగ్నమయ్యారు.

నేడు ప్రజా ఆశీర్వాదానికి ముత్తిరెడ్డి..
జనగామ టీఆర్‌ఎస్ అభ్యర్థిత్వం ఖరారైన తర్వా త హైదరాబాద్ నుంచి సోమవారం ఉదయం 10 గంటలకు వస్తున్న ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి జిల్లా ప్రారంభ సరిహద్దు పెంబర్తి కాకతీయ కళాతోరణం వద్ద నియోజకవర్గ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అక్కడి నుంచి భారీ మోటార్ సైకిళ్లతో జనగామ వరకు ర్యాలీగా బయలుదేరి తొలుత పెంబర్తిలో తర్వాత జనగామ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. అనంతరం చౌరస్తా మీదుగా నెహ్రూపార్కు, రైల్వేస్టేషన్ సెంటర్ మీదుగా పట్టణ శివారులోని యశ్వంతాపూర్ ఎల్లమ్మకు నైవేద్యం సమర్పించి తొలి మొక్కుతో నియోజకవర్గ ప్రజాశీర్వాదానికి బయలుదేరనున్నారు.

పోలింగ్ నిర్వాహణకు యంత్రాంగం సిద్ధం
కాగా, ఎన్నికల నేపథ్యంలో ఇటు టీఆర్‌ఎస్ అభ్యర్థులు ప్రచారం ప్రారంభించగా..అటు అధికార యంత్రాంగం పోలింగ్ నిర్వాహణకు సన్నద్ధమవుతోంది. ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు వచ్చినా నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు అధికార యంత్రాంగం దృష్టి సారించింది. పోలింగ్ కేంద్రా లు, ఓటర్ల జాబితా, సామగ్రి, ఈవీఎంలను సమకూర్చుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు ఓటర్ల నమోదు ప్రక్రియ కొనసాగించనున్నారు. జిల్లాకు చెందిన మూడు ని యోజకవర్గాల్లో సిట్టింగులకే మరోసారి అవకాశం కల్పించడంతో విస్తృత ప్రచారం చేసేందుకు కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే కుల సంఘాలతో సమావేశాలు, ఓటర్ల జాబితాపై దృష్టి సారించడంతో జిల్లాలో ఎన్నికల వేడి రాజుకుంటోంది.

97
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...