సీఎం కేసీఆర్‌తోనే అభివృద్ధి

Mon,September 10, 2018 12:23 AM

-రూ. 5.97 కోట్ల ఎస్డీఎఫ్, రూ.45.96 లక్షలసీడీఎఫ్ నిధులు మంజూరు
-పెద్దవంగరకు అదనంగా 203 డబుల్ ఇళ్లు
-ప్రతీ నూతన పంచాయతీకి రూ. 5 లక్షలు
-తాజా మాజీ ఎమ్మెల్యే దయాకర్‌రావు వెల్లడి
-ప్రతిపక్షాలను నిలదీయాలని ప్రజలకు పిలుపు
పెద్దవంగర, సెప్టెంబర్09 : సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని పాలకుర్తి నియోజకవర్గ తాజా మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీడీఎఫ్ నిధులు నియోజకవర్గ అభివృద్ధికి 2017-2019వరకు రూ.3.99 కోట్లు కేటాయించి పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. పెద్దవంగర మండల పరిధిలోని గ్రామాల అభివృద్ధికి ఎస్‌డీఎఫ్ నిధులు రూ.5.97కోట్లు, సీడీఎఫ్ నిధులు రూ.45.96లక్షలు అందించినట్లు తెలిపారు. పెద్దవంగర మండల పరిధిలో ఇప్పటికే కొన్ని గ్రామాల్లో డబుల్ బెడ్‌రూం పనులు చేపడుతున్నా.. అదనంగా 203 డబుల్ బెడ్‌రూం ఇండ్లను మంజూరు చేసినట్లు తెలిపారు. వాటి పనులకు త్వరలో శ్రీకారం చుట్టనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో చేపట్టని అభివృద్ధి పాలకుర్తిలో చేపట్టేలా సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా నిధులు అందించారని అన్నారు. పెద్దవంగర మండలంలో పరిపాలనా సౌలభ్యం కోసం ఏర్పా టు చేసిన ప్రతీ నూతన గ్రామ పంచాయతీ అభివృద్ధి రూ.5లక్షలను అందించినట్లు తెలిపారు.

మంత్రి కడియం శ్రీహరి ప్రత్యేక నిధులతో మండల కేంద్రంలోని ఐకేపీ భవన నిర్మాణానికి రూ.5లక్షలు అందజేసినట్లు తెలిపారు. పెద్దవంగర మండలం వడ్డెకొత్తపల్లి ఎస్సీ కాలనీకి 20, పోచారం చక్ర తండాకు 15, పెద్దవంగర ఎస్సీ కాలనీకి 30, ఆర్సీ తండాకు 10, మోత్యా తండాకు 10, పోచంపల్లి ఎస్సీ కాలనీకి 30, రాజమాన్‌సింగ్ తండాకు 08, చిట్యాల సూర్య తండాకు 10, బొమ్మకల్లు రెడ్డికుంట తండాకు 15 అదనంగా డబుల్ బెడ్‌రూం ఇళ్లను మంజూరు చేసినట్లు ఆయన గుర్తు చేశారు. టీఆర్‌ఎస్‌కు రాష్ట్రంలో ఎదురులేదని, మళ్లీ కేసీఆర్ సీఎం కావడం ఖాయమని అనారు. పాలకుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో తాను గెలవడం ఖాయమని, కార్యకర్తలు గ్రామాల్లో సైనికుల్లా పని చేయాలని సూచించారు.

అభివృద్ధిపై ప్రతిపక్షాలపై మాట్లాడితే ప్రజలు అడుగడుగునా నిలదీయాలన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిందన్నారు. మిషన్ భగీరథతో ప్రతీ ఇంటికి శుద్ధమైన తాగునీరు అందించనున్నట్లు తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వాలూ చేయని విధంగా కేసీఆర్ అభివృద్ధి చేశారన్నారు. నియోజకవర్గన్ని అభివృద్ధిలో రాష్ట్రంలో ఆదర్శంగా తీర్చిదిద్దేలా కృషి చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులతో పాలకుర్తి నియోజకవర్గంలో ప్రతిపక్షాలకు డిపాజిట్ దక్కదన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కమలాకర్, పాలకుర్తి దేవస్థాన చైర్మన్ రామచంద్రయ్యశర్మ, రైతు సేవా సహకార సంఘం వైస్ చైర్మన్ శ్రీనివాస్, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు ఐలయ్య, టీఆర్‌ఎస్ నాయకులు సుధాకర్, రాములు, లింగమూర్తి, మధు, రవి, టీఆర్‌ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

100
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles