కాకతీయుల కాలంలో అధికంగా శివాలయాల నిర్మాణం


Mon,September 10, 2018 12:21 AM

-కేంద్ర పురావాస్తు శాఖ చెన్నై కార్యాలయ సూపరింటెండెంట్ కన్నబాబు
కొడకండ్ల సెప్టెంబర్ 09: దక్షిణ భారత దేశంలో కాకతీయుల కాలం లో నిర్మించిన దేవాలయాల్లో అధికంగా శివాలయాలు ఉన్నాయని, ప్ర స్తుతం వాటిలో కొన్ని శిథిలాస్థలో ఉన్నాయని, వాటి వివరాలను సేకరించి కేంద్ర పురావస్తు శాఖకు అం దజేస్తామని కేంద్ర పురావాస్తు శాఖ చెన్నై కార్యాలయ సూపరింటెండెం ట్ కన్నబాబు తెలిపారు. ఆదివారం మండల కేంద్రంలోని మహాదేవాలయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొడకండ్ల ప్రాంతంలో మహాదేవాలయ నిర్మాణం 700 సంవత్సరాల క్రితం చేపట్టినట్లు ఆధారాలు ఉన్నాయన్నా రు. విస్నూర్‌లో శివాలయం, దేవర్పులలో ఉప్పలమనల్ల దేవాలాయా లు రికార్డులలో నమోదు అయ్యాయని, వీటి చరిత్రను పరిశీలిస్తున్నమని తెలిపారు. ఈ మూడు దేవాలయాలను పరిశీలించినట్లు ఆయన వెల్లడించారు. కార్యక్రమంలో సిబ్బందిడ్రాప్స్‌మెన్ రవికుమార్, ఆ లయ ప్రధాన అర్చకులు పిండిప్రో లు నాగదక్షణమూర్తి పాల్గొన్నారు.

102
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...