పాలకుర్తిలో ఎవరి పెత్తనం సాగదు


Mon,September 10, 2018 12:21 AM

-అభివృద్ధి ప్రదాత ఎర్రబెల్లి దయాకర్‌రావు మా నాయకుడు
-టీఆర్‌ఎస్ పాలకుర్తి నియోజకవర్గ అధికార ప్రతినిధి ఆంజనేయులు
దేవరుప్పుల, సెప్టెంబర్ 09: పాలకుర్తి అభివృద్ధి ప్రదాత, నిరంతరం ప్రజల మధ్య ఉండే మాజీ ఎమ్మెల్యే దయాకర్‌రావు వెంటే టీఆర్‌ఎస్ శ్రేణులు, తెలంగాణ ఉద్యమకారులు ఉంటారని, అసమ్మతిని సహించేది లేదని టీఆర్‌ఎస్ పాలకుర్తి నియోజకవర్గ అధికార ప్రతినిధి మేకపోతుల ఆంజనేయులు అన్నా రు. మండల కేంద్రంలో ఆదివారం పార్టీ మండల అధ్యక్షుడు బస్వ మల్లేశ్ అధ్యక్షతన జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో పాలకుర్తి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఎర్రబెల్లి దయాకర్‌రావును కేసీఆర్ ప్రకటించగా ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు, పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి తక్కళ్లపల్లి రవీందర్‌రావు తాను పాలకుర్తి బరిలో ఉన్నానంటూ ప్రకటించడం పార్టీకి చేటుచేస్తుందన్నారు. పాలకుర్తిలో జన్మదిన వేడుకలు, ఉద్యమకారుల సంఘం పేర జనాన్ని తరలించి అసమ్మతిగళమెత్తడం తగదన్నారు. కేసీఆర్ నిర్ణయం శిరోధార్యంటూనే పాలకుర్తి బరిలో ఉన్నానని ప్రకటించడం పార్టీని పరువును తీశారన్నారు.

పాలకుర్తిలో ఎవరి పెత్తనాన్ని టీఆర్‌ఎస్ శ్రేణులు సహించరని, అహర్నిశలు నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తూ అందరి మనసులు చూరగొన్న దయాకర్‌రావును విమర్శించడం అవివేకమవుతుందన్నారు. పార్టీలోనే వేరుకుంపటిని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని, జన్మదినం పేర రాజకీయాలు చేయ డం రవీందర్‌రావుకు తగదన్నారు. ఉద్యమకారులంటూ కార్యకర్తల్లో చిచ్చు పెడుతున్న కొందరు టీఆర్‌ఎస్ శ్రేణులను తప్పుదారిపట్టించి సమావేశానికి తరలించారని విమర్శించారు. స్వప్రయోజనాకు పార్టీని తాకట్టు పెట్టొద్దని కోరారు. రాష్ట్రంలో ఏ నియోజకర్గంలో జరగని అభివృద్ధి పాలకుర్తిలో జరిగిందని, టీఆర్‌ఎస్ శ్రేణులు దయాకర్‌రావుకు అండగా ఉంటాయని తెలిపారు. పదవులు కావాలంటే అధిష్టానాన్ని ఆశ్రయించాలని, ఇలా నియోజకవర్గ శ్రేణుల మధ్య పొరపొచ్చాలు తీసుకురావడం తగదన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ యూత్ మండల అధ్యక్షుడు చింత రవి,పాలకుర్తి దేవస్థాన కమిటీ సభ్యుడు జలేంధర్‌రెడ్డి, మండల నాయకులు సోమనర్సయ్య, జోగయ్య, లాలూనాయక్, కృష్ణమూర్తి, కాశబోయిన మల్లేశ్, తదితరులు పాల్గొన్నారు.

98
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...