మెట్ల పైనుంచి పడి వ్యక్తి మృతి


Mon,September 10, 2018 12:20 AM

చిలుపూరు, సెప్టెంబర్ 09:మండలంలోని చిన్నపెండ్యాల గ్రామానికి చెందిన మత్స్యకారుడు పోలు వెంకటేశ్వర్లు (56) ఆదివారం ప్రమాదవశాత్తు ఇంటి ఎదుట ఉన్న మెట్ల పై జారి పడి మృతి చెందాడు. గ్రామస్తుల కథనం ప్రకారం.. వెంకటేశ్వర్లు తెల్లవా రు జామున నిద్రలేచి ఇంటి బయటకు వస్తున్న క్రమంలో మెట్ల పై అడుగు వేయగా కాలు జారింది. దీంతో తలకు తీవ్ర గాయం కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే 108కు సమాచారం ఇవ్వగా అక్కడకు చేరుకున్న సిబ్బంది వైద్య పరీక్షలు నిర్వహించి మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో మృతుడి కటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుడికి భార్య యాదలక్ష్మి, కుమారుడు, కూతురు ఉంది. కాగా, మృతుడి కుటుంబాన్ని మ త్స్య పారిశ్రామిక సహకార సం ఘం జిల్లా డైరెక్టర్ నీల రాజు, ఎంపీటీసీ సభ్యు డు సంపత్‌కుమార్, మాజీ సర్పంచ్ సమ్మ య్య, ఎంసీవో యాదగిరి, టీఆర్‌ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు లింగారెడ్డి, నాయకులు యాకయ్య, రాజు, శ్రీను, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, నాగేశ్ పరామర్శించారు.

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...