కేసుల విచారణ పకడ్బందీగా చేపట్టాలి


Sun,September 9, 2018 01:12 AM

-డీసీపీ శ్రీనివాసరెడ్డి
-జనగామ ఠాణా తనిఖీ
జనగామ టౌన్, సెప్టెంబర్ 08: కేసుల విచారణ పకడ్బందీగా చేపట్టి నిజమైన నేరస్తులకు శిక్షలు పడే విధంగా పోలీసులు విధులు నిర్వర్తించాలని వెస్ట్‌జోన్ డీసీపీ శ్రీనివాసరెడ్డి ఆదేశించారు.శనివారం జిల్లా కేంద్రంలోని జనగామ పోలీసుస్టేషన్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధినిర్వహణలో పోలీసు సిబ్బంది సక్రమంగా నడుచుకోవాలన్నారు. రాత్రి సమయంలో పోలీసులు సరిగా గస్తీలు నిర్వహించి ప్రజలకు మెరుగైన సేవలను అందించాలన్నారు.అలాగే స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులకు మెరుగైన సేవలు అందించే బాధ్యత సన్నిహిత రిసెప్షన్ల కౌంటర్లపై ఉందన్నారు. ప్రజలకు బాధ్యతయుత సేవలు అందించడం ద్వారానే పోలీసులకు గౌరవం పెరుగుతుందని, ఫిర్యాదు దారులకు వెంటనే రశీదు అందించి ఆ ఫిర్యాదులను ఎప్పటికప్పుడు నమోదు చేయాలన్నారు. అదేవిధంగా పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలను తె లుసుకుని ఆయా కేసుల్లో నిందితులకు శిక్షలు పడేవిధంగా విచారణ చేపట్టాలని సూ చించారు. కార్యక్రమంలో టౌన్ సీఐ ముష్కా శ్రీనివా స్, ఎస్సైలు శ్రీనివాస్, పరమేశ్వర్, విద్యాసాగర్, కోర్టు కానిస్టేబుళ్లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

75
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...