ముత్తిరెడ్డికి వెల్లువెత్తిన శుభాకాంక్షలు..

Sun,September 9, 2018 01:11 AM

జనగామ, నమస్తే తెలంగాణ, సెప్టెంబర్ 08 : జనగామ అసెంబ్లీ నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థిత్వం ఖరారైన తాజా మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. శ్రావణ మాసంలో మంచి ఘడియలు ఉండటంతో శుక్రవారం రాత్రి జనగామలోని క్యాం పు కార్యాలయంలో అడుగుపెట్టిన ఆయనకు శనివారం ఉదయం నుంచి టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణు లు, నాయకులు, కార్యకర్తలు, వివిధ వర్గాల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.పూలబొకేలు, పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలిపారు. ముత్తిరెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన వారిలో మున్సిపల్ చైర్‌పర్సన్ గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ ఇర్రి రమణారెడ్డి, ఎంపీపీ బైరగోని యాదగిరిగౌడ్, మాజీ సర్పంచ్ బాల్దె సిద్ధిలింగం, టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు బండ యాదగిరిరెడ్డి, మార్కెట్ డైరెక్టర్ ఉడుగుల నర్సింహులు, గ్రంథాలయసంస్థ డైరెక్టర్ రవికుమార్, మండల రైతు కోఆర్డినేటర్ ప్రమోద్‌రెడ్డి, కౌన్సిలర్లు గజ్జెల నర్సిరెడ్డి, కొన్యాల జనార్ధన్‌రెడ్డి, ఎజాజ్, ఛాంబర్ ఆఫ్ కామర్ అధ్యక్షుడు పోకల లింగయ్య, నాయకులు పసుల ఏబెల్, ఉల్లెంగుల కృష్ణ, మామిడాల రాజు, లెనిన్, నారోజు రామేశ్వరాచారి, చిన్నం నర్సింహులు, ఏనుగుతల యాదగిరి, ఏనుగుతల సోమేశ్వర్, నీల రాంమనోహర్, నారసింహుల రామస్వామి, జనగాం సత్తిరెడ్డి, వడ్యాలపు రాజేందర్, డాక్టర్ సుధా సుగుణాకర్‌రాజు, జిట్టె శ్రీశైలం, బక్క లక్ష్మణ్, గంగాభవానీ, మేడె గంగా, షాహిస్తాషబ్నమ్, ఉడుగుల కిష్టయ్య, కాసా భాస్కర్, శారద స్వామి, మంతెన మణి, దామెర రాజు, పంతులు ప్రభాకర్‌రావు, సేవెల్లి మధుతోపాటు వందలాది మంది తరలివచ్చి శుభాకాంక్షలు తెలిపారు.

123
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles