సీఎం కేసీఆర్ రుణం తీర్చుకోలేనిది..


Sun,September 9, 2018 01:11 AM

చిలుపూరు, సెప్టెంబర్ 8: రైతుబీమా పథకంతో తమ కు టుంబాన్ని ఆదుకు న్న సీఎం కేసీఆర్ రుణం తీర్చుకోలేనిదని మండలంలోని వెంకటాద్రిపేట గ్రా మానికి చెందిన రైతు మోతే ఇస్తారి భార్య మరియ అన్నారు. ఇటీవల ఇస్తారి (48) అనార్యోగంతో మృతి చెందా డు. దీంతో రైతు బీమా పథకం కింద మృతుడి కుటుంబానికి రూ. 5లక్షలు మంజూరయ్యాయి. ఈ సందర్భంగా శనివారం ఆమె మాట్లాడుతూ తమకున్న ఎకరం భూమితోపాటు కూలీ పని చేసుకుంటు జీవనం కొనసాగిస్తున్నామన్నారు. తమకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారని, వారిలో ఇద్దరి పెళ్లిళ్లకు సుమారు రూ.3లక్షలు అప్పు చేశామన్నారు.ఈ క్రమంలో తన భర్త ఇస్తారి గత నెల24 వ తేదీన అనారోగ్యంతో మృతి చెందారన్నారు. దీంతో తమ కుటుంబం ఆగమైపోతుందనుకున్న తరుణంలో సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకం కింద రూ.5లక్షలు మంజూరయ్యాయన్నారు. ఈ డబ్బుతో అప్పు తీర్చడంతోపాటు తమ చిన్న కూతురు సుమలత చదువుకు వినియోగిస్తానని తెలిపారు. కాగా,తమ కుటుంబానికి కల్యాణలక్ష్మి పథకంతోపాటు రైతుబంధు, రైతుబీమా పథకం ద్వారా లబ్ధి చేకూరిందన్నారు. అందుకే తమ కుటుంబం జీవితాంతం కేసీఆర్‌కు రుణపడి ఉంటుందని, కేసీఆరే తమకు దేవుడని తెలిపింది.

86
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles

మరిన్ని వార్తలు...