జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి


Sun,September 9, 2018 01:11 AM

జనగామ టౌన్, సెప్టెంబర్ 08: జాతీయ లోక్‌అదాలత్‌లను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా సెషన్ 5వ అదనపు న్యాయమూర్తి వి నారాయణబాబు, సీనియర్ సివిల్ జడ్జి కే ఉమాదేవి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎంకే పద్మావతి అన్నారు. శనివారం జిల్లా న్యాయసేవ సంస్థ వరంగల్ ఆదేశాల మేరకు జనగామ కోర్టులో జాతీయ లోక్‌అదాలత్‌ను నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్షణికావేశంలో తప్పులు చేసి జీవితాలను నాశనం చేసుకోవద్దని, ప్రతి ఒక్కరూ న్యాయ వ్యవస్థపై పరిజ్ఞానం పెంచుకొవాలన్నారు. క్షణికావేశంలో చేసిన తప్పులను సరిదిద్దుకోవాలని క్షక్షిదారులకు సూచించారు.అలాగే లోక్ అదాలత్‌లో 64 కేసులను పరిష్కరించారు.ఈకార్యక్రమంలోబార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీరామ్‌శ్రీనివాస్, వివిధ మండలాలకు చెందిన సీఐలు, ఎస్సైలు, సిద్దిపేట జిల్లాలోని చేర్యాల పోలీసులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

81
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...