జనగామలో తాటికొండకు ఘనస్వాగతం

Sat,September 8, 2018 02:01 AM

జనగామ, నమస్తే తెలంగాణ, సెప్టెంబర్ 07 : స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఖరారైన డాక్టర్ తాటికొండ రాజయ్యకు జిల్లాలోని పెంబర్తి స్వాగత తోరణం వద్ద ఆ నియోజకవర్గ పార్టీ శ్రేణులు శుక్రవారం ఘనస్వాగతం పలికారు. స్టేషన్‌ఘన్‌పూర్, లింగాలఘనపురం, రఘునాథపల్లి మండలాల నుంచి పెద్దఎత్తున తరలివచ్చిన టీఆర్‌ఎస్ కార్యకర్తలు జిల్లా ప్రారంభ సరిహద్దులో ఎదురేగి పుష్పగుచ్ఛాలు అందించి పూలమాలతో ముంచెత్తి శాలువలతో సన్మానించారు. అక్కడి నుంచి రాజయ్య బుల్లెట్ వాహనాన్ని నడుపుకుంటూ పార్టీ శ్రేణులతో బైక్‌ర్యాలీగా ఆర్టీసీ చౌరస్తాకు చేరుకొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అక్కడే టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ చిత్రపటానికి మున్సిపల్, మార్కెట్ చైర్‌పర్సన్లు గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, బండ పద్మ, మున్సిపల్ కౌన్సిలర్ నర్సిరెడ్డి, రాజేందర్‌తో కలిసి క్షీరాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు ఎబెల్, జయపాల్‌రెడ్డి, రావెల రవి, ప్రణీత్‌రెడ్డి, కృష్ణ, నర్సింహులు, రాంమనోహర్, యాదగిరి, సందీప్, సురేందర్‌రెడ్డి, లెనిన్, రాజు, మధు, గంగాభవాని, నాగరాజు, శ్రీశైలం, దేవేందర్‌రెడ్డి, రమేశ్, మల్లికార్జున్, షాహిస్తాషబ్నమ్, రాజన్న యువసేన నాయకులు రవి, రమేశ్, అజ్జు, వినిత్ తదితరులు పాల్గొన్నారు.

నిడిగొండ, రఘునాథపల్లిలో..
రఘునాథపల్లి : మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య స్టేషన్‌ఘన్‌పూర్ నియోజక వర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఖరారై హైదరాబాద్ నుంచి స్టేషన్‌ఘన్‌పూర్ వస్తున్న సందర్భంగా టీఆర్‌ఎస్ శ్రేణులు శుక్రవారం మండలంలోని నిడిగొండ, రఘునాథపల్లిలో ఆయనకు ఘనస్వాగతం పలికారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పోకల శివకుమార్, యూత్ మండల అధ్యక్షుడు కుర్ర కమలాకర్, నాయకులు చెంచు రమేశ్, కొర్ర రాజేందర్, మాల్యానాయక్, మడ్లపల్లి రాజు, వారాల రమేశ్, కొయ్యాడ స్వామి, ముసిపట్ల విజయ్‌కుమార్, వెంకటేష్‌యాదవ్, బంద కుమార్, తదితరులు పాల్గొన్నారు.

నియోజకవర్గ కేంద్రంలో..
స్టేషన్‌ఘన్‌పూర్‌టౌన్: స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఖరారైన డాక్టర్ తాటికొండ రాజయ్యకు నియోజకవర్గ కేంద్రంలో టీఆర్‌ఎస్ శ్రేణు లు శుక్రవారం ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భం గా మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేశారు.

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో రాజయ్య మాట్లాడుతూ స్టేషన్‌ఘన్‌పూర్ నియోజక వర్గం టికెట్ కేటాయించిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు చెప్పారు.సమావేశంలో టీఆర్‌ఎస్ జిల్లా నాయకులు సీహెచ్. నరేందర్‌రెడ్డి, ఎస్. జగన్, పార్సి కమల్‌కుమార్, పాగాల సంపత్‌రెడ్డి, పి. రంజిత్‌రెడ్డి, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ అన్నెం బ్రహ్మారెడ్డి, వైస్ చైర్మన్ భూక్యా రమేశ్‌నాయక్, దేవస్థానం చైర్మన్ కుంభం కుమారస్వామి, మూల నాగరాజు, ఎంపీటీసీలు గోనెల ఉపేందర్, సత్యనారాయణరాజు, సింగపురం దయాకర్, నాయకులు చెరిపల్లి రామలు, గట్టు మనోహర్‌బాబు, మునిగెల రాజు, మాజీ సర్పంచ్ ఇల్లందుల ప్రతాప్, టి. సురేశ్‌కుమార్, సిరిగిరి శ్రీనివాస్, తాటికొండ మేరిళ, పాసర్లపూడి లక్ష్మి, గోనెల సావిత్రి, పొన్నం రజిత, బొల్లు లక్ష్మి, గోనెల డబ్బరాజు, అన్నెపు ఐలయ్య, డాక్టర్. జగన్, డాక్టర్ కుమార్, రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

126
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles